https://oktelugu.com/

Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి మరో అప్డేట్ … ఫుల్ జోష్ లో అభిమానులు …

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ద‌గ్గుపాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న మ‌ల్టీ సార్ట‌ర్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తుండ‌గా… సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ డూప‌ర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఈ క్రేజీ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్‌ ప్లై , డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇప్పటికే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 13, 2021 / 09:49 AM IST
    Follow us on

    Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ద‌గ్గుపాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న మ‌ల్టీ సార్ట‌ర్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తుండ‌గా… సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ డూప‌ర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది.

    ఈ క్రేజీ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్‌ ప్లై , డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్స్ కి అనూహ్యా స్పంద‌న వ‌చ్చింది. ఈ నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు వెండి తెర మీదికి వ‌స్తుంద‌ని ప్రేక్ష‌కులు వేచి చూస్తున్నారు. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.
    అయితే.. ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ను అనౌన్స్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

    https://twitter.com/MusicThaman/status/1447929095136989199?s=20

    భీమ్లా నాయక్ చిత్రం నుంచి ఇటీవల సెకండ్ సాంగ్ ” అంత ఇష్టం ” ను 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించగా … ఇప్పుడు ఆ పాట ప్రోమో లోడ్ అవుతుందని ట్వీట్ చేసి ప్రేక్షకుల్లో మరింత జోష్ పెంచారు. ఈ వార్తతో పవన్ అభిమానుల్లో కోలాహలం నెలకొంది. అయితే పవన్ వరస సినిమాలతో దూసుకుపోతూ ఒకదాని తర్వాత మరొకటి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ మూవీ తో పాటు హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, అనే చిత్రాల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.