https://oktelugu.com/

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ అరెస్ట్..హైదరాబాద్ లో ఇంటిని ముట్టడించిన ఒంగోలు పోలీసులు!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేసారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఇంటిని ఒంగోలు పోలీసులు ముట్టడించారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 25, 2024 / 01:32 PM IST

    Ram Gopal Varma arrested.. Ongole police raided the house in Hyderabad!

    Follow us on

    Ram Gopal Varma : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేసారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఇంటిని ఒంగోలు పోలీసులు ముట్టడించారు. వారం రోజుల క్రితమే రామ్ గోపాల్ వర్మ ని పోలీసులు విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. నేడు ఆయన విచారణకు హాజరు కావాలి. కానీ ఆయన విచారణకు రాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు సిద్ధం అయ్యారు. దీంతో రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గడిచిన 5 సంవత్సరాలలో రామ్ గోపాల్ వర్మ ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లపై ఎన్నో దారుణమైన కామెంట్స్ చేసాడు. ట్విట్టర్ లో తన అకౌంట్ నుండి ఈ ఇద్దరి పై ఎన్నో మార్ఫింగ్ ఫోటోలను అప్లోడ్ చేసాడు. ఇవి అప్పట్లో పెను దుమారం రేపింది.

    కేవలం ఇది మాత్రమే కాదు, ఆయన ఈ ఇద్దరి ని కించపరుస్తూ వ్యూహం అనే సినిమా కూడా చేసాడు. ఇలా ఒక్కటా రెండా ఎన్నో నీచమైన వ్యాఖ్యలు చేసి అబాసుపాలైన రామ్ గోపాల్ వర్మ, ఎన్నికలలో కూటమి సంచలన విజయం సాధించడంతో తాను ఇక పొలిటికల్ కామెంట్స్ చేయనని, రాజకీయ నేపథ్యంలో సినిమాలు తీయనని చెప్పుకొచ్చాడు. కానీ ప్రభుత్వం మాత్రం ఆయన్ని క్షమించలేదు. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలం కి చెందిన తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో వేసిన ట్వీట్స్ ని ఆధారాలతో సహా పంపి కేసు నమోదు చేసాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ నాకు అరెస్ట్ నుండి రక్షణ కలిపించాలని, నన్ను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని హై కోర్టు క్వాష్ పిటీషన్ వేయగా, హై కోర్టు ఆ క్వాష్ పిటీషన్ ని రద్దు చేసింది.

    దీంతో పోలీసులు 19వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. కానీ రామ్ గోపాల్ వర్మ తనకు నాలుగు రోజుల సమయం కావాలని పోలీసులను రిక్వెస్ట్ చేయగా అందుకు అనుమతించారు. కానీ నాలుగు రోజులు గడిచిన తర్వాత రామ్ గోపాల్ వర్మ విచారణకు రాకపోవడంతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లారు. అయితే రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లో లేనట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్ కోసం ఆయన తమిళనాడు లోని కోయంబత్తూర్ ప్రాంతంలో ఉన్నాడట. మరోపక్క రాంగోపాల్ వర్మ తరుపున న్యాయవాది విచారణకు సంపూర్ణంగా సహకరిస్తామని, కాకపోతే కొన్ని రోజుల సమయం కావాలని పోలీసులను కోరాడు. కానీ ప్రోటోకాల్ ని లెక్క చెయ్యని రామ్ గోపాల్ వర్మ ని పోలీసులు అరెస్ట్ చేసేందుకే సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. మరోపక్క ఈ విషయాన్నీ తెలుసుకున్న టీడీపీ, జనసేన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.