Cashew Benefits: ఆరోగ్యం కోసం పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోకపోవడంతో మనకు అనేక రోగాలు అంటుకుంటున్నాయి. ఇటీవల కాలంలో వాటి ప్రాధాన్యం పెరుగుతోంది. వైద్యులు సైతం డ్రై ఫ్రూట్స్ ను ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీడిపప్పు గురించి తెలుసుకుందాం. దాని ప్రాధాన్యమేమిటో ఓ సారి లుక్కేద్దాం. జీడిపప్పులో అనేక పోషకాలు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచనలు చేస్తున్నారు.

జీడిపప్పు గుండెకు మంచిది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్సీబీఐ) నివేదిక ప్రకారం వెల్లడించింది. దీంతో చాలా రకాల రోగాలు నయమవుతాయని చెప్పింది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల చెడు కొవ్వు తగ్గుతుంది. దీన్ని రోజు తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వస్కలర్ రియాక్టివిటీ వంటి సమస్యలు రావు. వాపును తగ్గిస్తుంది. రోజు గుప్పెడు జీడిపప్పు తింటే అందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రక్తానికి సంబంధించిన రోగాలను కూడా నయం చేస్తుంది. ఇందులో ఉండే కాపర్ గుణాలు ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపడానికి దోహదపడతాయి. కాపర్ లోపంతో బాధపడేవారు జీడిపప్పును తనడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కంటికి సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తుంది. కాలుష్యంలో తిరడం వల్ల మనకు తెలియకుండా కంటి సంబంధిత సమస్యల బారిన పడుతుంటాం. జీడిపప్పు తీసుకోవడం వల్ల జియో క్సాంటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్ ఉంటుంది. ఇది యూవీ కిరణాల నుంచి కంటిని కాపాడే రెడీనాను సురక్షితంా ఉంచుతుంది. కంటికి సంబంధించిన అనేక సమస్యలను ఇది దూరం చేస్తుంది.

బరువు తగ్గడానికి కూడా జీడిపప్పు ఎంతో మేలు చేస్తుంది. అధిక బరువుతో బాధపడే వారు రోజు గుప్పెడు జీడిపప్పు తింటే త్వరగా ప్రయోజనం కలుగుతుంది. ఇది కొవ్వును కరిగిస్తుంది. మెటబాలిజంను పెంచుతుంది. జీడిపప్పును దేనితో జతచేయకుండానే తింటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉత్పత్తి అయి కొవ్వును తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తొందరగా బరువు తగ్గాలనుకునే వారికి ఇదో మంచి మందుగా చెబుతున్నారు. జీర్ణక్రియలకు సంబంధించిన సమస్యలకు కూడా జీడిపప్పు చెక్ పెడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ తో మనకు అనేక లాభాలు కలుగుతాయి. జీడిపప్పును రోజు తింటూ ఉంటే ఎన్నో రకాల జబ్బుల నుంచి దూరం కావచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతో జీడిపప్పును ప్రతి రోజు తింటూ మనకు సమస్యలు లేని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని సూచిస్తున్నారు.