Alert To Users
Alert To Users : ప్రతి ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం గా పేర్కొంటారు. దేశంలోని ఆర్థిక వ్యవహారాలతో పాటు కొన్ని నిబంధనలు రూల్స్ వ్యాప్తిక సంవత్సరంలోనే నిర్ణయిస్తారు. ముఖ్యంగా పన్ను స్లాబ్ ల గురించి ఈ సంవత్సరంలోనే మారుతూ ఉంటాయి. అలాగే కొత్తగా బడ్జెట్లో ఏర్పాటు చేసిన ఆర్థిక అంశాలను కూడా ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేస్తున్నారు. 2025 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొన్ని అంశాలతో పాటు.. ప్రతి ఏడాది మారే కొన్ని ఆర్థిక వ్యవహారాలు ఈ ఏడాది కూడా ఉండబోతున్నాయి. అయితే ఈ ఏప్రిల్ ఒకటి నుంచి ఏమి మారబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక…ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!
పన్ను లావాదేవీలు:
మిడిల్ క్లాస్ పీపుల్స్ నుంచి బడా వ్యాపారుల వరకు పన్ను విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ఏప్రిల్ ఒకటి నుంచి మారబోతుంది. కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 12 లక్షల ఆదాయం గా ఉన్న వారికి ఎలాంటి టాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు. వీటిలో స్టాండర్డ్ డిటెక్షన్ రూ 75 వేల తో పాటు రూఫ్ 12.75 లక్షల వరకు టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే రూ. 25 వేల రిబేట్లు కూడా రూ. 60 వేలకు పెంచారు.
టిడిఎస్ నిబంధనలు:
కొత్త ఏడాదిలో టిడిఎస్ నిబంధనలు మారబోతున్నాయి. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు రూ.50,000 దాటితే టీడీఎస్ చార్జ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. లక్షకు పెంచారు. అలాగే 60 ఏళ్ల లోపు ఉన్నవారు ఇప్పటివరకు రూ. 40 వేలు డిపాజిట్ చేస్తే.. టిడిఎస్ చార్జీలను వేసేవారు. కానీ ఇప్పుడు 50 వేల వరకు అవకాశం ఇచ్చారు.
క్రెడిట్ కార్డు రివార్డులు..:
కొత్త ఏడాదిలో కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు రివార్డులు చేంజ్ కాబోతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంకు గా ఉన్న ఎస్బిఐ ప్లాటినం కార్డు, ఎస్బిఐ సింప్లీ క్లిప్ క్రెడిట్ కార్డు, ఎయిర్ ఇండియా ఎస్బిఐ సిగ్నేచర్ కార్డులకు రివార్డులు దగ్గరున్నాయి. అలాగే ఏప్రిల్ 18 నుంచి యాక్సిస్ బ్యాంకు కూడా తన క్రెడిట్ కార్డుల పై రివార్డులు తగ్గించింది. అయితే వినియోగదారులు తమ క్రెడిట్ కార్డులను రెన్యువల్ చేస్తే చార్జీలను మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు కాడు ఏప్రిల్ ఒకటి నుంచి రెన్యూవల్ అయ్యే వాటికి కూడా ఫీజులను తీసుకోదు.
యూపీఐ సర్వీసులు:
యూపీఐపీ బ్యాంకు లింకు చేసి వాడేవారు చాలామంది ఉన్నారు. అయితే యూపీఐ కి బ్యాంకులు లింకు చేసి వాటిని వాడకుండా ఉండడంవల్ల… లేదా మొబైల్ ఇనాక్టివ్ గా ఉంటే ఆ సర్వీస్ లను నిలిపివేయాలని ఇప్పటికే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఆదేశాలు పంపింది. ఈ ఆదేశాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయబడతాయి.
Also Read : జియో యూజర్లకు అలర్ట్.. ఈ విధంగా మోసపోయే అవకాశాలు ఎక్కువట?