https://oktelugu.com/

Hacking Alert: స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక…ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

Hacking Alert: ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో మనకు స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తుంది. అదే విధంగా ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండడంతో ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో ఎన్నో రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా వివిధ రకాల యాప్స్ ద్వారా కొన్ని సార్లు మన భారీ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. మనకు తెలియకుండానే కొన్ని రకాల యాప్స్ మన మొబైల్ ఫోన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 22, 2021 / 01:00 PM IST
    Follow us on

    Hacking Alert: ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో మనకు స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తుంది. అదే విధంగా ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండడంతో ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో ఎన్నో రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా వివిధ రకాల యాప్స్ ద్వారా కొన్ని సార్లు మన భారీ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. మనకు తెలియకుండానే కొన్ని రకాల యాప్స్ మన మొబైల్ ఫోన్ లో ఉండటం వల్ల మన బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది.

    Hacking Alert

    Also Read: ఈ వస్తువులు కలలో కనిపిస్తే మీకు జీవితంలో ఎదురుండడు.. అన్ని శుభాలే!

    ఈ విధమైనటువంటి మోసాలకు అడ్డు కత్తెర వేయడం కోసం ప్రముఖ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ ప్రేడియో (Pradeo) ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను అలర్ట్ చేస్తోంది. కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా జోకర్ మాల్వేర్ నుమన మొబైల్ ఫోన్ లోకి పంపించి మనకు తెలియకుండానే ఎన్నో రకాల ఎస్ఎంఎస్లను యాక్సెప్ట్ చేస్తూ.. అవసరం లేని ప్రీమియంలను సబ్స్క్రైబ్ చేస్తూ, ఆటోమేటిక్ గా ఆన్లైన్ ప్రకటనలపై క్లిక్ చేస్తూ మనం మనకు తెలియకుండానే ఖాళీ చేస్తుంది.మనం మన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు తప్ప మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యే విషయం మనకు తెలియదు. ఇలా చాలా మంది జోకర్ మాల్వేర్ వల్ల పెద్ద మొత్తంలో డబ్బును నష్టపోయారు.

    ఈ విధంగా ఎవరు ఈ జోకర్ మాల్వేర్ బారిన పడకుండా ఉండటం కోసం కొన్ని ఆప్స్ పొరపాటున కూడా మన మొబైల్ ఫోన్ లో ఉంచుకోకూడదని సెక్యూరిటీ సొల్యూషన్స్ మొబైల్ యూజర్లను హెచ్చరించింది. మరి ఎలాంటి యాప్స్ మన మొబైల్ ఫోన్ లో ఉండకూడదు అనే విషయానికి వస్తే.. సెపరేట్ డాక్ స్కానర్, కలర్ మెసేజ్, కన్వీనియెంట్ స్కానర్ 2,ఎమోజీ వాల్పేపర్, సేఫ్టీ యాప్ లాక్,ఫింగర్ టిప్ గేమ్బాక్స్, పుష్ మెసేజ్ టెక్ట్సింగ్ అండ్ ఎస్ఎంఎస్ వంటి ఆప్స్ మన మొబైల్ ఫోన్లో లేకుండా చూసుకోవాలి. పొరపాటున ఈ విధమైనటువంటి యాప్స్ ఉన్నవారు వెంటనే వాటిని డిలీట్ చేయాలని సొల్యూషన్స్ మొబైల్ యూజర్లను హెచ్చరిస్తుంది.

    Also Read: రోడ్డుపై దొరికిన డబ్బులను తీసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!