Jio alert: దేశీయ టెలీకాం దిగ్గజం జియోకు కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. రోజురోజుకు జియోను వినియోగించే యూజర్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. అయితే సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జియో తమ యూజర్లకు మెసేజ్ లను పంపుతోంది. జియో యూజర్లు జాగ్రత్తగా ఉండాలని ఈ సంస్థ సూచనలు చేస్తుండటం గమనార్హం. దేశంలో రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.
ఫేక్ కాల్స్, ఫేక్ మెసేజ్ ల ద్వారా సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలలోని నగదును కాజేస్తున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జియోతో పాటు ఇతర టెలీకాం కంపెనీలు సైతం ప్రస్తుతం కస్టమర్లను అలర్ట్ చేసే పనిలో పడ్డాయి. ఈకేవైసీ చీటింగ్స్, ఫేక్ ఎస్ఎంఎస్ విషయంలో తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని జియో యూజర్లకు సూచనలు చేసింది. పండుగ ఆఫర్లు, న్యూ ఇయర్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సంస్థ పేర్కొంది.
Also Read: కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అతి తక్కువ వడ్డీకే ఆ సంస్థ రుణాలు!
టెలీకాం కంపెనీలు ఫ్రాడ్ క్లిక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూజర్లకు చెబుతున్నాయి. ఈ-కేవైసీ వెరిఫికేషన్ పేరుతో వచ్చే మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కంపెనీలు సూచిస్తున్నాయి. మోసపూరిత మెసేజ్ ల విషయంలో, వెరిఫికేషన్ అంటూ వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని జియో చెబుతోంది. థర్డ్ పార్టీ యాప్స్ ను జియో యూజర్లు డౌన్ లోడ్ చేసుకోవద్దని సంస్థ సూచిస్తోంది.
యూజర్ల ఆధార్ నంబర్, బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన సమాచారంను అపరిచితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదు. ఫేక్ కాలర్లు పంపే లింక్స్, అటాచ్ మెంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: శత్రువుల దాడి మీపై ఉండకూడదు అంటే మీ ప్రవర్తన ఇలా ఉండాలి.. చాణిక్య నీతి!