Bank Holidays: బ్యాంకు వినియోగదారులకు అలర్ట్..

2023 ఏడాదిలో వినాయక చవితి సందిగ్ధం నెలకొంది. కొందరు సెప్టెంబర్ 18 న జరుపుకుంటామని అంటుండగా..మరికొందరు 19న నిర్వహించాలని అంటున్నారు. అయితే కాణిపాకం దేవాలయం వారు 18న వినాయక చవితి జరుపుతామని ప్రకటించడంతో ఆరోజునే ప్రభుత్వ సెలవు ఇవ్వాలని నిర్ణయించారు.

Written By: Chai Muchhata, Updated On : September 15, 2023 5:30 pm

Bank Holidays

Follow us on

Bank Holidays: పండుగల సీజన్ మొదలైంది. ఇక నుంచి వరుస సెలవులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.దీంతో బ్యాంకువ్యవహారాలు నడిపేవారు సెలవులపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కోసారిఅత్యవసర సమయంలో బ్యాంకు ఉందని వస్తే క్లోజ్ చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈసారి వినాయక చవితి సందర్భంగా బ్యాంకులకు వరుసగా సెలవులు వచ్చాయి. ఆ సెలవుల గురించిన వివరాలు మీ ముందు ఉంచుతున్నాం..

2023 ఏడాదిలో వినాయక చవితి సందిగ్ధం నెలకొంది. కొందరు సెప్టెంబర్ 18 న జరుపుకుంటామని అంటుండగా..మరికొందరు 19న నిర్వహించాలని అంటున్నారు. అయితే కాణిపాకం దేవాలయం వారు 18న వినాయక చవితి జరుపుతామని ప్రకటించడంతో ఆరోజునే ప్రభుత్వ సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. పండితుల ప్రకారం చతుర్థి తిథి సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12.39 నుంచి సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 1.43 వరకు ఉంటుంది. ఈ సమయంలో వినాయకుడినిఇంటికి తెచ్చుకోవాలని అంటున్నారు.

అయితే సెప్టెంబర్ 17న ఆదివారంఅవుతుంది. 18న కర్ణాటక, తెలంగాణలో సెలవు ప్రకటించారు. దీంతో ఈ రెండు రోజులు తెలంగాణలో బ్యాంకుకు సెలవులు ఉంటాయి. అయితే గుజరాత్, తమిళనాడు, గోవా, ఒరిస్సాలో 19న సెలవు ప్రకటించారు. దీంతో కొన్ని బ్యాంకులు ఈరోజు కూడా పనిచేయవు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వినాయక చవితికి బ్యాంకు హాలీడే లేదని ప్రకటించారు. కానీ ఈ సమాచారంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇలా సెలవులపై సందిగ్ధం నెలకొనడంతో బ్యాంకుకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.