Alcohol : మద్యం తాగడం వల్ల అనేక రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయినా కూడా చాలామంది మద్యం నువ్వు సేవిస్తూనే ఉంటున్నారు. ఒత్తిడి నుంచి దూరం కావడానికి, మనసు ప్రశాంతత కోసం మద్యం సేవిస్తున్నామని చెప్పినా ఇది మోతాదుకు మించి దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది. గుండె సమస్యల నుంచి దూరం కావడానికి తక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం ఆరోగ్యకరమే అని వైద్యులు చెప్పినా.. ప్రస్తుత కాలంలో ఇది క్యాన్సర్ కు దారితీస్తుందని ఇటీవల వైద్యులు తేల్చారు. అయితే ఇదే సమయంలో భారత్ లో National Family Health Survey ప్రకారం మద్యం ఎక్కువగా తాగే టాప్ ఐదు రాష్ట్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
దేశంలో మద్యం సేవించే వారి రాష్ట్రంలో గోవా ఐదో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 36.9% ఆల్కహాల్ ను సేవిస్తూ ఉంటారు. ఆ తర్వాత నాలుగో స్థానంలో మణిపూర్ రాష్ట్రంలో 37.5% మద్యం తాగుతారు. అలాగే సిక్కిం రాష్ట్రంలో 39.8% ఆల్కహాల్ సేవించి మూడో స్థానంలో ఉన్నారు. టాప్ టు లో తెలంగాణలో 43.4% మద్యం సేవిస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో 52.7% ఆల్కహాల్ తీసుకుంటూ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
Also Read: నేడే విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సరికొత్త టీజర్.. సినిమా విడుదల తేదీ ఎప్పుడంటే!
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 31.2% ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే ఎక్కువగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మద్యంను ఒక పండుగలాగా నిర్వహిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న కార్యక్రమం జరిగినా మద్యం కొనుగోలు చేస్తుంటారు. శుభకార్యాలలోనూ మద్యం సేవిస్తూ ఉంటారు. అయితే మద్యం సేవించడం పై ఇటీవల అవగాహన కార్యక్రమాలు పెరుగుతున్నాయి. మద్యం ఏ కొంచెం తీసుకున్నా.. అనారోగ్యమే అని తెలియడంతో చాలామంది దూరం ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ కొన్ని సర్వేల ప్రకారం యూత్ బాగా మధ్యానికి అడిక్ట్ అయినట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే మద్యానికి బానిస కావడంతో వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. స్నేహితులతో పార్టీలు, రకరకాల కారణాలతో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మద్యం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చాలామంది నిపుణులు అంటున్నారు.
ఒత్తిడి తగ్గించుకోవడానికి మద్యం సేవిస్తున్నామని చెబుతున్న.. ఇది దీర్ఘకాలికంగా అనేక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కేవలం మద్యం సేవించడం వల్ల లివర్ మాత్రమే చెడిపోయేది. కానీ ఇప్పుడు క్యాన్సర్ కారకాలు కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. మద్యం సేవించడం వల్ల పురుషులైనా.. మహిళలైనా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇందులోని కల్తీ మద్యం సేవిస్తే వీరి ఆయుష్షు కూడా తగ్గే అవకాశం కూడా ఉందని అంటున్నారు. కల్తీ మద్యం సేవించడం వల్ల అనారోగ్యంతో ప్రారంభమై ఆ తర్వాత చివరకు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు.
అయితే ఆల్కహాలకు బానిస అయిన వారు దాని నుంచి మెల్లిగా బయటపడే ప్రయత్నం చేయాలి. ఒకేసారి మానివేసిన ఇబ్బందులకు గుర అయ్యే అవకాశం ఉంది.