Vijay Devarakonda Kingdom New Teaser: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie). మే 31 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. కాసేపటి క్రితమే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. నేడు రాత్రి 7 గంటల 3 నిమిషాలకు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ప్రోమో ని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 31 న విడుదల చేయబోతున్నారట. వాస్తవానికి ఈ సినిమాని ఆగష్టు 28 న విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఎట్టి పరిస్థితిలోనూ ఈ సినిమాని జులై నెలలోనే విడుదల చేయాలి.
అందుకే వేరే గత్యంతరం లేక జులై 31 న విడుదల చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 24 న విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన వారం రోజులకే ‘కింగ్డమ్’ విడుదల కాబోతుంది. నాగవంశీ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. ఆయనకు పవన్ కళ్యాణ్ తో క్లాష్ పడేందుకు అసలు ఇష్టం లేదు. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. పోనీ ఈ చిత్రాన్ని జులై 31 న కాకుండా, ఆగష్టు 7 న విడుదల చేద్దాం అనుకుంటే నాగవంశీ కి అసలు కుదరడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను నాగ వంశీ నే కొనుగోలు చేశాడు కాబట్టి. పైగా అదే రోజున రజనీకాంత్ కూలీ కూడా విడుదల కాబోతుంది. థియేటర్స్ ఆ సమయానికి దొరకడం చాలా కష్టం.
Also Read: వెంకటేష్ తదుపరి సినిమాల మీద క్లారిటీ ఇచ్చాడుగా… ఆ డైరెక్టర్ ను వదిలేలా లేడుగా…వైరల్ వీడియో…
పోనీ ఆగష్టు 28 కి షిఫ్ట్ అవుదాం అనుకుంటే నెట్ ఫ్లిక్స్ సంస్థ కనీసం 15 కోట్ల రూపాయిల ఫైన్ ని విదిస్తుంది. ‘కింగ్డమ్’ చిత్రం జులై 31 న విడుదల అవ్వడం వల్ల ఆ సినిమాకు వచ్చిన నస్టమ్ ఏమి లేదు. కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి మాత్రం కచ్చితంగా నష్టం ఉంటుంది. ఎందుకంటే థియేట్రికల్ రైట్స్ ‘హరి హర వీరమల్లు’ వి భారీ రేంజ్ లో ఉంటాయి. అవి రీకవర్ అయ్యి బయ్యర్స్ లాభాల్లోకి రావాలంటే కనీసం రెండు వారాల ఫ్రీ రన్ ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. పైగా నిర్మాత AM రత్నం ఇప్పటికీ ఒక్క సెంటర్ లో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ ని క్లోజ్ చేయలేదు. దీంతో అసలు ఈ సినిమా 24 న వస్తుందా లేదా అనేది అభిమానుల్లో కలుగుతున్న సందేహం.