Akshaya Tritiya 2022: మన దేశంలో అక్షయతృతీయను ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకమైన పండుగగా జరుపుకుంటారు. ఈ రోజును పవిత్రమైనదిగా పూజిస్తారు. ఈ సంవత్సరం రేపు అక్షయ తృతీయ రానుంది. దీంతో అందరు బంగారం కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అంతా మంచే జరుగుతుందని ప్రజల విశ్వాసం. సనాతన సంప్రదాయం. అందుకే అక్షయ తృతీయకు అంతటి ప్రాధాన్యం ఇస్తుంటారు.

ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ ఏడాది మే 3న వస్తోంది. మన విశ్వాసాల ప్రకారం దానాలు, స్నానాలు, జాపాలు, యాగాలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. దీనికి తోడు బంగారం కొనుగోలు చేయడం కూడా ఇందులో భాగమే కావడం గమనార్హం. దీంతో లక్ష్మీ దేవి కృప మనపై ఉంటుందనేది ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండబోతోంది. అవేంటో చూద్దాం.

Also Read: Lakshmi Devi To Her Fathers: ఈ 3 పేర్లున్న అమ్మాయిలు తండ్రికి లక్ష్మీదేవిలే..
అక్షయ తృతీయ రోజున కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతోంది. ప్రతి పని కలిసొస్తుంది. ఉద్యోగంలో వేతనం పెరిగే సంఘటనలున్నాయి. డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతారు. అనుకున్న పనుల్లో ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు. మీ మాట చెల్లుబాటు అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. సంతోష వార్తలు వింటారు.
సింహ రాశి వారికి కూడా మంచి కాలమే. లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపై ఉంటుంది. పప్పు దానం చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయి. నూతన ఉద్యోగావకాశాలున్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. డబ్బు చేతికి అందుతుంది. అవసరాలు తీరుతాయి. సంతోషంగా గడుపుతారు.

ధనుస్సు రాశి వారికి కూడా అదృష్టం బాగుంది. మీ సమయం కూడా బంగారంలా మారినోతుంది. ప్రతి విషయంలో మీకు అందరు అండగా నిలుస్తారు. గృహ, వాహన లాభాలున్నాయి. సంపద పెరుగుతుంది. దీంతో సంతోషంగా గడుపుతారు. లక్ష్మిదేవి అనుగ్రహం మీపై ఉంది. అందుకే మీకు ఈ రోజు అన్ని పనులు నెరవేరుతాయి.
మకర రాశి వారికి కూడా శుభప్రదమే. కెరీర్ బాగుంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. కోర్టు కేసులు కూడా అనుకూలంగా వస్తాయి. ప్రతి పనిలో విజయం మీదే. దీంతో మీకు ఎదురుండదు. సానుకూల ఫలితాలు ఉండటంతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ప్రతి విషయంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది.
వృషభ రాశి వారికి కూడా మంచి కాలమే. లక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరేందుకు మంచి రోజు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాత బకాయిలు వసూలవుతాయి. దీంతో సంతోషం కలుగుతుంది. ప్రతి పనిలో విజయం మీదే. అందుకే ఈ రోజు మీరు పట్టిందల్లా బంగారమే.
Also Read:MLC Kavitha: కవితక్కా.. ఇదేం లెక్క..!