https://oktelugu.com/

Rashmika Mandanna: రష్మికతో ఫస్ట్ రొమాన్స్, తర్వాత లవ్.. క్రేజీ అప్ డేట్ !

Rashmika Mandanna: ‘మున్నా’, ‘ఊపిరి’, ‘మహర్షి’ లాంటి భారీ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తెచ్చుకున్నాడు వంశీ పైడిపల్లి. పైగా పెద్ద చిత్రాల దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో వంశీకి మంచి పేరు ఉంది. ఇక ఇలాంటి డైరెక్టర్ తో దిల్‌ రాజు బ్యానర్‌ నుండి సినిమా వస్తోంది అంటే.. ఆ సినిమా పై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయి. పైగా దిల్‌ రాజు బ్యానర్‌ నుండి ఓ చిత్రం వస్తుందంటే అది హిట్టే అంటారు సినీ ప్రియులు. […]

Written By:
  • Shiva
  • , Updated On : May 2, 2022 / 04:26 PM IST
    Follow us on

    Rashmika Mandanna: ‘మున్నా’, ‘ఊపిరి’, ‘మహర్షి’ లాంటి భారీ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తెచ్చుకున్నాడు వంశీ పైడిపల్లి. పైగా పెద్ద చిత్రాల దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో వంశీకి మంచి పేరు ఉంది. ఇక ఇలాంటి డైరెక్టర్ తో దిల్‌ రాజు బ్యానర్‌ నుండి సినిమా వస్తోంది అంటే.. ఆ సినిమా పై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయి. పైగా దిల్‌ రాజు బ్యానర్‌ నుండి ఓ చిత్రం వస్తుందంటే అది హిట్టే అంటారు సినీ ప్రియులు. ఈ క్రమంలో దేశ మార్కెట్‌పై కన్నేశాడు దిల్‌ రాజు. ఇప్పటికే జెర్సీ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా, తమిళ స్టార్‌ విజయ్‌తో ఓ ద్విభాషా చిత్రాన్ని తీస్తున్నాడు.

    Rashmika Mandanna, Vijay

    తమిళంలో విజయ్ నెంబర్ వన్ హీరో. అందుకే.. ఈ సినిమా సౌత్ లోనే భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, క్రేజీ భారీ సినిమా పై ఒక లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈద్ బ్రేక్ పూర్తి కాగానే మొదలై షెడ్యూల్ లో రష్మిక కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. రష్మిక – విజయ్ రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నారు. ఆ తర్వాత లవ్ సీన్స్ షూట్ చేస్తారట. ప్రస్తుతం విజయ్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

    Also Read: Sarkaru Vaari Paata Movie Trailer:‘సర్కారి వారి పాట’ ట్రైలర్ లో సీఎం జగన్ పై మహేష్ సెటైర్? పెనుదుమారం!

    ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇక కథానాయకుడిగా విజయ్‌ కి ఇది 66వ సినిమా. ఈ సినిమాతో విజయ్ మార్కెట్ కూడా తెలుగులో డబుల్ కానుంది. దిల్ రాజు తెలుగులో అగ్రనిర్మాత. తన సినిమాను భారీగా రిలీజ్ చేసుకోవడంలో దిల్ రాజు ఎక్స్ పర్ట్. అందుకే.. విజయ్, దిల్ రాజు అడగగానే డేట్లు ఇచ్చాడు.

    Rashmika Mandanna, vijay

    పైగా వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇప్పటికే వంశీ నేషనల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా పెద్ద హీరోలు అందరితో సినిమాలు చేశాడు. ఇప్పుడు ఏకంగా తన కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ స్టార్ అయిన తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.

    అన్నిటికీ మించి వంశీ చెప్పిన కథ విజయ్ కి బాగా నచ్చింది. అందుకే వీరి కాంబినేషన్ లో తెలుగు – తమిళ ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. మరి ఇది ఏ స్థాయి హిట్ అవుతుందో చూద్దాం.

    Also Read:Bigg Boss Telugu OTT: ఆ లేడీ కంటెస్టెంట్ బ్రా విప్పమన్న యాంకర్ శివ.. వీడియోతో కడిగేసిన నాగార్జున

    Recommended Videos


    Tags