Weird Food Combinations: నిత్యం మనం తీసుకునే ఆహారాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నింటిని కలిపి కాంబినేషన్ లో తీసుకుంటే ఇబ్బందులే ఎదురవుతాయి. మనకు తెలియకుండానే అందులో ఉండే గుణాలు మనకు చేటు తెచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఏది తింటే ఎలాంటి లాభమో తెలుసుకుని మరీ తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాని దొరికింది కదాని ఏది పడితే అది కడుపులో వేయడం సురక్షితం కాదు. తిండి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే వ్యాధులు దరిచేరడం సహజమే.

ఈ నేపథ్యంలో తినే తిండి విషయంలో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఉదయం లేచిన నుంచి ఏదో ఒకటి కడుపులో వేయడం కాదు దాని గురించి మనం తెలుసుకోవడం ఉత్తమం.
అన్ని పండ్లు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవే ఉంటాయి. కానీ కొన్నింటిని కాంబినేషన్ లో తీసుకోవడం వల్ల అనర్థాలు చోటుచేసుకుంటాయి. ఏదైనా తినాలనుకునేటప్పుడు దాని వల్ల మనకు ఏం ప్రయోజనం? ఏ సమయంలో తినాలి? దేని కాంబినేషన్ లో తింటే మంచి ఫలితాలు వస్తాయనే విషయంలో స్పష్టంగా తెలుసుకుని తింటే మంచిది.
మన ఆరోగ్యానికి హాని చేసేవి కూడా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుని మనం తినేందుకు మొగ్గు చూపాల్సి ఉంటుంది. కొన్ని రకాల పండ్లను కలిపి తీసుకుంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
పండ్లు తినేటప్పుడు ఎప్పుడూ ఒకే రకమైన పండ్లు తినం. కొన్నిసార్లు కొన్నింటిని మిక్స్ చేసుకుని తినడం చేస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో మనకు తెలియకుండానే కొన్నింటి వల్ల మనకు ప్రమాదాలు చోటుచేసుకోవడం కామనే. ఈ క్రమంలో వేటిని కలిపి తీసుకోకూడదో అనేదానిపై స్పష్టత ఉండాలి. పండ్లు కలిపి తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవచ్చు.
మధుమేహులకు జామకాయ మంచి ఆహారం మంచిది. ఇవి తింటే షుగర్ నియంత్రణలో ఉంటుంది. వీరికి అరటి పండు ప్రతికూలం. దీన్ని తినొద్దు. పొరపాటున జామ కాయ తిన్న తరువాత అరటి పండు తింటే అరిష్టమే. దీంతో ఇవి రెండు కలిపి తినడం వల్ల మనకు అనారోగ్యమే కలుగుతుంది. జామకాయ తిన్న తరువాత అరటి పండు తింటే కడుపులో తిప్పినట్లు అవుతుంది. పనస పండును పాలతో కలిపి తినడం మంచిది కాదు. పాలతో కలిపి పనస తీసుకుంటే చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి. ఈ కాంబినేషన్ వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.

బొప్పాయి పండు తినేటప్పుడు లేదా తిన్న తరువాత నిమ్మకాయ కానీ నిమ్మరసం కానీ తీసుకుంటే ప్రాణాంతకమవుతుంది. ఈ కాంబినేషన్ లో అనేక రకాల సమస్యలు వస్తాయి. ఈ రెంటిని కలిపి తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. పిల్లలకు మరింత నష్టం కలుగుతుంది. పొరపాటున కూడా బొప్పాయితో నిమ్మకాయలను కలిపి తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతాయి. పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయి. కడుపులో ఉండే జీర్ణరసాలు నిమ్మకాయకంటే యాసిడ్ గుణాలు కలిగి ఉండటం వల్ల విషంగా మారుతుంది.
రాత్రిపూట భోజనం చేసే సమయంలో నిమ్మకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి కలిపి తినకూడదు. నిమ్మకాయ, ఉసిరి కాయ వంటి పచ్చళ్లను కలిపి తినడం వల్ల తలలోని సూక్ష్మమైన నాడులలో పగిలిపోయే ప్రమాదం ఉంది. దీంతో పక్షవాతం వచ్చే అవకాశం పొంచి ఉంది. ఇలా కొన్నింటిని కలిపి తినడం వల్ల మనకు ఎన్నో అనర్థాలు ఏర్పడతాయి. అందుకే వాటిని కలిపి తినడం మంచిది కాదు.