Health Tips: ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక రకాల సమస్యలను ఎదుర్కోంటున్నారు. ఒత్తిడి, నిద్రలేమి మరియు పోషకాహారాన్ని తీసుకోకపోవడం వంటి పలు కారణాల వలన అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇక 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎందుకు? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా?
సాధారణంగా 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరి శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. అంతక ముందున్న విధంగా శరీరం ధృడంగా ఉండదు. ఆరోగ్యం కూడా గతం తరహాలో ఉండదనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ విషయంతో పాటు ఆరోగ్య విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బలహీనత ఇలా పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే 30 ఏళ్లు దాటిన తరువాత ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యమైనది బరువు పెరగడమని తెలుస్తోంది. అయితే బరువును నియంత్రించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జీవనశైలి సరిగా లేకపోయినా.. ఆహారం సరిగా లేకపోయినా స్థూలకాయం సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆహార నియమాలను పాటించడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు. అందుకే డాక్టర్లను సంప్రదించి సమతుల ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని తెలియజేస్తున్నారు.
బరువు తగ్గాలని భావించేవారు ముఖ్యంగా చేయాల్సింది బద్ధకాన్ని వదిలించుకోవాలి. బద్దకంగా కూర్చోవడానికి బదులు తేలికైన వ్యాయామాలు చేసే ప్రయత్నం చేయాలి. ఇది బరువు తగ్గించడానికి ఉపయోగపడటంతో పాటు కండరాలను ధృడం చేస్తుంది. నిత్యం వ్యాయామం చేయడం వలన క్రమంగా బరువును తగ్గొచ్చు. స్వీట్లతో పాటు కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పోషకారాన్ని తీసుకుంటూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవాటు చేసుకుంటే బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.