Oats: ఓట్స్ తో మంచితో పాటు ఇన్ని దుష్ప్రభావాలు ఉన్నాయా?

ఆరోగ్యం పట్లు శ్రద్ధ వహిస్తూ కొందరు ఆహార నియమాలు పాటిస్తున్నారు. కానీ వాటి వల్ల కూడా అనారోగ్యాలే వస్తున్నాయి. ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఓట్స్ తింటున్న విషయం తెలిసిందే.

Written By: Swathi, Updated On : April 2, 2024 1:52 pm

advantages and disadvantages of oats

Follow us on

Oats: ఆరోగ్యం కోసం చాలా మంది వివిధ రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆహార నియమాలు పూర్తిగా మారిపోయాయి. ఇవే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి కూడా. కొన్ని సార్లు మధుమేహం, అధిక బరువు, బీపీ, షుగర్లు అంటూ కేవలం ఆహారం వల్లనే వస్తున్నాయి వ్యాధులు. అయితే ఆరోగ్యం పట్లు శ్రద్ధ వహిస్తూ కొందరు ఆహార నియమాలు పాటిస్తున్నారు. కానీ వాటి వల్ల కూడా అనారోగ్యాలే వస్తున్నాయి. ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఓట్స్ తింటున్న విషయం తెలిసిందే. వీటివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాం.

ఓట్స్ లో థయామిన్, జింక్ , మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, ఫాసర్పస్,సెలీనియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి, అయినా కూడా వీటివల్ల దుష్ప్రభావాలు ఉన్నాయట. ఓట్స్ లో కరిగే ఫైబర్, బీటా గ్లూకోన్ ఉంటాయి. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. శరీరంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

100 గ్రాముల ఓట్స్ లో 389 కేలరీలు అందుతాయి. ఇందులో ఫుల్ గా ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కార్బోహైడ్రేట్లు కలిగిని ఓట్స్ చాలా మందికి ఉదయం టిఫిన్ కూడా. ఓట్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయట. ఓట్స్ లో లిగ్నాన్స్ ఉండడం వల్ల రొమ్మ క్యాన్సర్, అండాశయాలు, ప్రొస్టేట్ క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిద్రకు అవసరం అయ్యే మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది కూడా. అంతేకాదు బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి.

ఆరోగ్యకరమైన పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇన్ని మంచి ఫలితాలు ఉన్న ఓట్స్ వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఇందులో ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కిడ్నీలు పాడవుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడం బెటర్. ఓట్స్ వల్ల అలర్జీ సమస్య కూడా వస్తుంది. కొందరికి గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. ప్రాసెస్ చేసిన ఓట్స్ తినడం వల్ల శరీరానికి అసలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఓట్స్ వల్ల మంచి ఫలితాలతో పాటు చెడు ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త.