Adhar Card : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డును కలిగి ఉన్న ప్రజలను అలర్ట్ చేసింది. సెక్యూరిటీ ఫీచర్లు తక్కువగా ఉండే పీవీసీ ఆధార్ కార్డులను వాడవద్దని సూచనలు చేసింది. ఓపెన్ మార్కెట్ లో దొరికే పీవీసీ ఆధార్ కార్డులు ఇన్ వాలిడ్ అని యూఐడీఏఐ వెల్లడించింది. దేశంలోని ప్రజలు కేవలం 50 రూపాయలు చెల్లించడం ద్వారా యూఐడీఏఐ నుంచి ఆధార్ పీవీసీ కార్డులను పొందవచ్చు.
యూఐడీఏఐ నుంచి పొందిన కార్డులను ఎక్కడైనా ఉపయోగించే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా బయటినుంచి పొందే కార్డులు వాలిడ్ కావని యూఐడీఏఐ పేర్కొంది. ఎక్కువమంది ప్రజలు ఓపెన్ మార్కెట్ నుంచి పీవీసీ కార్డులను పొందుతున్న నేపథ్యంలో యూఐడీఏఐ ప్రకటన వల్ల కార్డులు ఇన్‌వాలిడ్ అయ్యాయి. యూఐడీఏఐ నుంచి పొందే కార్డులో సెక్యూరిటీ ఫీచర్లు, డెమోగ్రాఫిక్, ఫోటోగ్రాఫ్, ఇతర వివరాలు ఉంటాయి.
ఈ పీవీసీ కార్డులో డిజిటల్ గా క్యూఆర్ కోడ్ రూపంలో సంతకం కూడా ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వాళ్లకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ కార్డు ఇంటికి చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు యూఐడీఏఐ జారీ చేసే పీవీసీ కార్డులో ఎంబాసిడ్ ఆధార్ లోగోతో పాటు జారీ తేదీ, ప్రింట్ తేదీ, గిల్లోచే నమూనా, మైక్రో టెక్ట్స్, హోలోగ్రామ్, సెక్యూర్ క్యూఆర్ కోడ్, ఇతర ఫీచర్లు కూడా ఉంటాయి.
https://myaadhaar.uidai.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆధార్ పీవీసీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డుకు లింక్ చేసుకున్న మొబైల్ నంబర్ కు ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ను క్లిక్ చేసి పేమెంట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆధార్ కార్డును కలిగి ఉన్నవాళ్లు సులభంగా పీవీసీ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.