మనిషి చనిపోయిన తర్వాత పాటించే ఆచారాలు, సాంప్రదాయాలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రాంతాలను బట్టి కూడా ఈ ఆచారాలు, సాంప్రదాయాలు మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో పాటించే అంత్యక్రియల పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో మనిషి చనిపోతే మృతదేహాలను మట్టిలో పూడ్చిపెట్టి ఖననం చేస్తారు.
ఇస్లాం మతస్థులతో పాటు క్రిస్టియన్ మతస్థులు కూడా ఇదే సాంప్రదాయంను పాటించడం జరుగుతుంది. ఈజిఫ్ట్ లో మాత్రం మృతదేహాలను బట్టలు కట్టి ఆ శవాలను పెట్టెలో బంధిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ మమ్మీలు మళ్లీ బ్రతుకుతాయని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. ఒకప్పుడు ఈజిఫ్ట్ కే పరిమితమైన ఈ ఆచారాన్ని భారత్, చైనా, టిబెట్, థాయిలాండ్, శ్రీలంకలలో కూడా పాటించడం జరుగుతోంది.
చైనీయుల ఆచారం ప్రకారం కొండ చివరన రాయికి లేదా రెండు చెక్కల మధ్యన ఉరి తీయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాళ్లు స్వర్గానికి వెళతారని ప్రజలు నమ్ముతారు. హిందూ మత ఆచారాన్ని అనుసరించి కొన్ని ప్రాంతాల్లో కట్టెలపై మృతదేహాన్ని కాలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం అమలులో ఉంది. పర్సియన్ దేశస్థులు మాత్రం చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను పక్షులు, రాబందులకు ఆహారంగా వేస్తారు.
ప్రస్తుతం ఈ పద్ధతి చాలావరకు తగ్గిపోగా శవాలను సోలార్ ప్లేట్లపై ఉంచే ఆచారాన్ని అక్కడ పాటిస్తున్నారు. సోలార్ ప్లేట్ల వేడి వల్ల శవం దహనం అవుతుంది. బ్రెజిల్, న్యూగినియా దేశాలలో చనిపోయిన శవాలను ముక్కలుగా చేసి భుజిస్తారు. అయితే ప్రస్తుతం ఈ పద్ధతిని అక్కడి ప్రజలు పాటించడం లేదు. దక్షిణ అమెరికాలోని ఒక ప్రాంతంలో మృతదేహాలను నదులు లేదా సముద్రాలలో పడేసి అంత్యక్రియలు జరపడం జరుగుతుంది.
ఇజ్రాయిల్, ఇరాక్ దేశాలలో ఊరికి చివరన ఉండే గుహలలో చనిపోయిన వ్యక్తులను వదిలివేయడం చేస్తారు. పెద్దపెద్ద రాళ్లను వినియోగించి శవాలను ఊరికి చివరన ఉండే గుహలలో వదిలేస్తారు. మన దేశంలో ఒకప్పుడు సతీసహగమనం ఆచారాన్ని పాటించేవారు. దక్షిణ ఫసిఫిక్ లోని ఫిజి ప్రాంతంలో మాత్రం ఎవరైనా చనిపోతే వారితో పాటు ఆ వ్యక్తి కుటుంబంలోని మరో వ్యక్తి కూడా చనిపోవాల్సి ఉంటుంది. కుటుంబంలోని మరో వ్యక్తి గొంతుకు తాడు లేదా బట్ట ఉపయోగించి చంపడం లేదా గొంతు నులిపివేసి చంపడం జరుగుతుంది.