UnderWear : సోషల్ మీడియా పుణ్యామాని కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మానవ జీవితం ఎలా ఉండాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎటువంటి అలవాట్లు ఉండాలి? అనే విషయాలపై చాలా మంది ప్రత్యేక వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తన్నారు. అలాగే మనుషులు ఎటువంటి దుస్తులు ధరించాలి? ఏవి ధరిస్తే ఆరోగ్యం? అనేవి కూడా చెబున్నారు. ప్రస్తుతం మగవారు జీన్స్ టీషర్ట్ లేదా జీన్స్ షర్ట్ వేసుకుంటున్నారు. ఉద్యోగం చేసేవారు ఫార్మల్ డ్రెస్ ధరిస్తున్నారు. అయితే పై డ్రెస్ ఎలా ఉన్నా లోప ల దుస్తుల్లో మాత్రం డ్రాయర్, బనియన్ వేసుకుంటారు. బనియన్ వేసుకోవడం వల్ల బయటతిరిగినప్పుడు కూల్ ఉంటుంది. కానీ కొందరు బనియన్ ను ధరించరు. అయితే డ్రాయర్ వేసుకోవడంపైన రేఓ వీడియో ఆసక్తినిపుతోంది. ఓ వీడియోలో చెబుతున్న ప్రకారం డ్రాయర్లు వేసుకోవడం వల్ల సంతానోత్సత్తికి భంగం కలుగుతుందని చెప్పడం ద్వారా షాక్ తింటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే?
కొందరికి డ్రాయర్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. మరికొందరు కచ్చితంగా దీనిని ధరిస్తారు. అయితే డ్రాయర్ ధరించే వారు ఎప్పటికీ దీనిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఒకసారి వాడిన డ్రాయర్ మరోసారి వాడకుండా జాగ్రత్త పడాలి. లేకుండా ఇన్ఫెక్షన్లు వస్తాయి. మానవ శరీరంలో ప్రైవేట్ పార్టులో ఎక్కువ శాతం గాలి చొరబడదు. దీంతో ఇక్కడ ఎక్కువ శాతం చెమట వల్ల వచ్చిన తేమ కారణంగా కొన్ని క్రిములు ఉంటాయి. ఇక్కడికి గాలి చొరబడకపోవడం వల్ల అవి అభివృద్ధి చెందుతాయి. ఆ తరువాత అలాగే ఉండడం వల్ల దురద ఏర్పడి దద్దుర్లు వస్తాయి. అందువల్ల డ్రాయర్ వేసుకునేవారు ఇంటికి వచ్చిన సమయంలో దీనిని తీసేయడం గానీ లేదా లూజ్ గా ఉన్న డ్రెస్ వేసుకోవడం గానీ అలవాట చేసుకోవాలి.
తాజాగా ఓ వీడియోలో ఓ సిద్ధాంతకర్త షాకింగ్ ఇచ్చే విషయాన్ని చెప్పాడు. మగవారు డ్రాయర్ అస్సలు ధరించకూడదట. డ్రాయర్ వేసుకోవడం వల్ల సంతానోత్పత్తి తగ్గే అవకాశం ఉందని ఆయన చెబుతున్నాడు. డ్రాయర్ వేసుకున్న వారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుందని ఆయన చెప్పుకొస్తున్నాడు. ముఖ్యంగా చిన్న పిల్లలు డ్రాయర్ వేసుకోకుండా ఉండడం వల్ల వారిలో సంతానోత్పత్తి శక్తి పెరుగుతుంది. భారతదేశంలో పురాతన కాలం నుంచి డ్రాయర్ వేసుకునే సంస్కృతి లేదని, ఇతర దేశాల్లో దీనిని పాటించడం వల్ల వారి ద్వారా మన దేశంలో ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు. పురాతన కాలంలో డ్రాయర్లు కాకుండా వేరే ఏర్పాట్లు చేసుకునేవారని ఆయన చెప్పారు.
అయితే ఈ వీడియోపై కొందరు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. చాలా మందికి డ్రాయర్ వేసుకునే అలవాటు లేదని, ఇప్పుడీ కారణంగా డ్రాయర్ వేసుకోకుండా ఉండొచ్చని అంటున్నారు. అయితే ఇంతకాలం డ్రాయర్ వేసుకోని వారిని చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడీ విషయంలో చాలా మంది అది పాటిస్తారా? అని కొశ్చెన్ వేస్తున్నారు. కొంత మంది మాత్రం డ్రాయర్ వేసుకోకపోవడం వల్లే అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు.