
Syrup : మన వంటింట్లో ఉండే మసాలా దినుసులతో మనకు ఆరోగ్య పరిరక్షణ కలుగుతుంది. పసుపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జాజికాయ, వాము, జీలకర్ర వంటి వాటి వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వీటి వల్ల దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలు దూరం అవుతాయి. మనకు ఆరోగ్యం బాగుండాలంటే వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. జీలకర్ర, ధనియాల దినుసులు మన కూరల్లో ఉపయోగిస్తుంటాం. దీంతో మనకు ఎన్నో విధాలైన లాభాలు కలుగుతున్నాయి.
మనలో రోగ నిరోధక శక్తిని పెంచి అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ఇవి సాయపడతాయి. జీలకర్రను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా పోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కొవ్వు తగ్గించడంలో దోహదపడతాయి. అధిక బరువును అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జీలకర్రలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో మంచి ఫలితాలు ఉంటాయి. జీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడే వారికి ఇవి ఎంతో తోడ్పడతాయి.
రక్తహీనతను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తి పెంచడంలో ధనియాలు ఉపయోగపడతాయి. ధనియాలు వాడితే ఎముకలు దృఢంగా మారుతాయి. నోటి ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో కొవ్వు స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణ సమస్యలను తగ్గించడంలో, మూత్ర పిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ధనియాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి.

జీలకర్రను ఉపయోగించి ఒక చిట్కా తయారు చేసుకుందాం. ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. అందులో ఒక టీ స్పూన్ జీలకర్రను ఒక టీ స్పూన్ ధనియాలను వేసి మరిగించాలి. అందులో రెండు చిటికెల మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఆ నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. తరువాత గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి వడకట్టుకుని గ్లాసులోకి పోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజు ఉదయం పరగడుపున తాగడం వల్ల మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
ఈ నీటిని తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ కషాయం మంచి ఫలితం ఇస్తుంది. దీన్ని తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కషాయంతో మనకు ఎన్నో లాభాలున్నాయి.