Beauty Tips: రోజ్ వాటర్, పసుపు, అలోవెరాలతో చర్మం మెరిసిపోయే ప్యాక్

పసుపు వంటల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా అందానికి కూడా మంచి రిజల్ట్ ను ఇస్తుంది. దీన్ని చాలా మంది ఫేస్‌ప్యాక్స్‌లో వాడతారు.

Written By: Swathi, Updated On : June 17, 2024 4:29 pm

Beauty Tips

Follow us on

Beauty Tips: మొటిమలు, మచ్చలు లేని మొహం ఉంటే చాలు బాగుంటుంది ఫేస్. ఇప్పుడు చాలా మంది మొహంలో మొటిమలు లేదా మచ్చలు వంటివి ఉంటాయి. అయితే పడుకునే ముందు ఓ చిన్న పని చేస్తే వీటినుంచి దూరం అవచ్చు. ముఖ్యంగా మేకప్ వేసుకుంటే మాత్రం క్లీన్ చేసి పడుకోండి. ఇదే కాదు మరిన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుంది. అవేంటో ఓ సారి చూసేయండి.

పసుపు వంటల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా అందానికి కూడా మంచి రిజల్ట్ ను ఇస్తుంది. దీన్ని చాలా మంది ఫేస్‌ప్యాక్స్‌లో వాడతారు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, కర్కుమిన్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయం చేస్తాయి. దీనిని రాయడం వల్ల చర్మ మంట తగ్గుతుంది. అదే విధంగా చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

రోజ్ వాటర్ టోనర్ లా పని చేసి మంచి మెరుపు ఇస్తుంది. రోజ్ వాటర్‌లో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని రాత్రిపూట ముఖానికి రాస్తే చర్మం క్లీన్ గా మారుతుంది. రోజ్ వాటర్ వల్ల నల్లని వలయాలకు చెక్ పెట్టవచ్చు.

స్కిన్‌కి కావాల్సిన హైడ్రేషన్‌ని అందిస్తుంది అలోవెరా జెల్. దీనిని రాయడం వల్ల పొడి చర్మం తగ్గి మొటిమలు తగ్గుతుంటాయి. చర్మ సమస్యల్ని దూరం చేయడంలో చాలా పని చేస్తుంది. అలోవెరా చర్మం రంగుని మెరుగ్గా చేసి సన్ ట్యాన్ ను, నల్ల మచ్చల్ని దూరం చేయడంలో సహాయం చేస్తుంది.

ముందుగా 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌ని ఓ కప్పులోకి తీసుకుండి. ఇందులోకే పావు టీ స్పూన్ పసుపు, అరకప్పు రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. దీన్ని ఒక కంటెయినర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజు రాత్రి పడుకునే ముందు రాస్తే చర్మంపై ఉన్న మచ్చలు, ముడతలు తగ్గుతాయి. అంతేకాదు స్కిన్ కూడా బాగా మెరుస్తుంది.