Holy River: సాయంత్రం, రాత్రి నదుల్లో స్నానం చేస్తున్నారా?

హిందువులు గంగానదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే గంగా నది ప్రవహించే కాశి, ప్రయాగ, హరిద్వార్, రిషికేశ్ ప్రాంతాలకు కూడా భక్తులు పోటేత్తుతుంటారు.

Written By: Swathi, Updated On : June 17, 2024 4:22 pm

Holy River

Follow us on

Holy River: హిందూ మతంలో గంగ, యమునా, సరస్వతి, గోదావరి, కృష్ణా వంటి నదులను భగవంతుడి అవతారాలుగా భావించి పూజిస్తారు. ఇప్పుడు కాదు ఈ సాంప్రదాయం పూర్వకాలం నుంచి ఉంది. నదులను అత్యంత పవిత్రమైనవిగా పాపాలు పోగొట్టే మహామహినత్వమైన శక్తి గలవిగా భావిస్తుంటారు. నదీ స్నానం చేయడం వల్ల పాపాలు తొలికి, శారీరక, మానసిక ఆరోగ్యం తో పాటు, పాపాలు పోతాయని నమ్ముతారు పెద్దలు. అయితే సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం నదీస్నానం ఆచరించేందుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.

హిందువులు గంగానదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే గంగా నది ప్రవహించే కాశి, ప్రయాగ, హరిద్వార్, రిషికేశ్ ప్రాంతాలకు కూడా భక్తులు పోటేత్తుతుంటారు. మకర సంక్రాంతి, కుంభమేళా, గంగా దసరా వంటి పండుగలలో లక్షలాది మంది ప్రజలు తమ పాపాలను పోగొట్టుకోవడానికి.. సుఖ వంతమైన జీవితాన్ని గడపడానికి గంగ ఉన్న దగ్గరికి స్నానం చేయాలని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు.

మారుతున్న కాలంలో. ప్రజల అలవాట్లు, ఆచార సంప్రదాయాలను అనుసరించడంలో కూడా మార్పులు వచ్చాయి. అయితే పని బిజీ అంటూ సమయం లేకుండా ఒక పని చేస్తుంటారు. ఉదయం చేయాల్సినవి సాయంత్రం, సాయంత్రం చేయాల్సినవి ఉదయం కూడా చేస్తుంటారు. అదే విధంగా పవిత్ర నదుల్లో సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి సమయంలో కూడా స్నానం చేస్తున్నారు కొందరు. సూర్యాస్తమయం తర్వాత రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని కొందరు.. నదుల్లో తక్కువ రద్దీ ఉంటుందని మరి కొందరు రీజన్స్ చెబుతూ స్నానమాచరిస్తున్నారు.

ఇలా సాయంత్రం, రాత్రి సమయాల్లో స్నానం చేస్తూ తమ జీవితంలో తామే సమస్యలను ఆహ్వానిస్తున్నారు అంటున్నారు పండితులు. హిందూ మత విశ్వాసాల ప్రకారం నదీ స్నానం నిర్దిష్టమైన సమయంలోనే చేయాలంటున్నారు. సాంప్రదాయకంగా పవిత్రమైన నదులలో స్నానం చేస్తేనే ఆరోగ్యానికి మేలట. పురాణాల ప్రకారం రాత్రి సమయంలో యక్షులు పవిత్ర నదుల దగ్గర స్నానం చేసి కూర్చుంటారని నమ్ముతారు.

యక్షులు నీరు, అడవులు, చెట్లు మొదలైన వాటితో సంబంధం ఉన్న ప్రకృతి సంబంధించిన వ్యక్తులుగా వీరి గురించి చెబుతున్నారు పండితులు. . ఈ జీవులు రాత్రి సమయంలో ఎక్కువ చురుకుగా కదులుతాయని.. రాత్రి నదుల వద్ద సంచరిస్తాయని చెబుతుంటారు పండితులు. అందుకే ఈ సమయంలో నదుల్లో స్నానం చేయకూడదు అంటారు. అంతేకాదు సాయంత్రం, రాత్రి సమయాల్లో నదుల వద్ద ఎలాంటి వెలుతురు ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.