Rohit Sharma Injury: టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో కీలకమైన సెమీస్ లో విజయం సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే సెమీస్ చేరుకున్న ఇండియా విజయం సాధిస్తేనే ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంటుంది. లేదంటే ఇంటి దారి పట్టాల్సి వస్తుంది. దీంతో ఈ మ్యాచులు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఆటగాళ్ల ప్రదర్శనపైనే ఇది ఆధారపడి ఉంది. ఈ వరల్డ్ కప్ లో చిన్న జట్లే పెద్ద జట్లను భయపెట్టాయి. నెదర్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమితో ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. ఆతిథ్య జట్టు ఆస్త్రేలియా కూడా సెమీస్ కు రాలేదు.

టీమిండియా ఈ సారి ఎలాగైనా కప్ గెలుచుకోవాలనే ఉత్సాహంతో ఉంది. అడిలైడ్ వేదికగా సెమీస్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రాక్టీసు మొదలు పెట్టారు. ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీ20 ప్రపంచ కప్ కీలక ఘట్టానికి చేరింది. నవంబర్ 9,10 తేదీల్లో రెండు సెమీఫైనల్స్ జరగనున్నాయి. సూపర్ 12లో లాగా సెమీస్ కు అదృష్టాలు ఉండవు. నాకౌట్ రౌండ్లు కాబట్టి ఇంటి దారి చేరుకోవాల్సిందే. దీంతో టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సిందే. మ్యాచ్ లో అజాగ్రత్తగా ఉంటే ఓటమి పొందితే ఇక ఇంటికి పోవాల్సిందే.
సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ తో పాకిస్తాన్ , అడిలైడ్ వేదికగా ఇండియాతో ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ లపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దాదాపు 15 ఏళ్ల తరువాత టీమిండియా కప్ గెలవాలని ప్రయత్నిస్తోంది. సెమీస్ కోసం తన వ్యూహాలను ఖరారు చేసుకుంటోంది. విజయం సాధించాలని కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఇండియా ప్రత్యర్థి ఇంగ్లండ్ పై నెగ్గాలని భావిస్తోంది. అయితే ప్రాక్టీసు సందర్భంగా టీమిండియాకు భారీ షాక్ తగిలేలా ఉంది. ప్రాక్టీసు సెషన్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నెట్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా కుడిచేతికి గాయమైంది.

గాయం తగిలాక కొద్దిసేపు కూడా ప్రాక్టీసు చేయలేకపోయాడు. క్రీజు వదిలి వెళ్లిపోయాడు. చాలా సేపు ప్రాక్టీసుకు రాలేదు. దీంతో మేనేజ్ మెంట్ కంగారుపడింది. కానీ ఐస్ క్యూబ్ తో కొద్దిసేపు సేదతీరిన తర్వాత రోహిత్ మళ్లీ నెట్స్ లో ప్రాక్టీస్ కు వచ్చాడు. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ గాయపడి మ్యాచ్ కు దూరమైతే కష్టమే. కానీ రోహిత్ గాయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ గాయంతో మ్యాచ్ ఆడటం సముచితం కాదనే వాదన వస్తోంది. రోహిత్ ఫామ్ లో లేకున్నా టీమ్ ను సరైన దారిలో పెడుతూ విజయాలు సొంతం చేస్తున్నాడు.. అందుకే కెప్టెన్ క్రీజులో ఉంటేనే టీమ్ కు మేలు కలుగుతుందనే భావం వస్తోంది.