Hurry Up: ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లపై వినియోగదారులకు మోజు పెరుగుతోంది. పెట్రోల్ ఖర్చులు తగ్గడంతో పాటు వాతావరణ కాలుష్య నివారణలో విద్యుత్ వాహనాలు ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్లు మొన్నటి వరకు ప్రీమియం ధరలను కలిగి ఉన్నాయి. దీంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ వాటిని సొంతం చేసుకోవడానికి ఆలోచించేవారు. కానీ కంపెనీల మధ్య పోటీ పెరగడంతో కొన్ని లో బడ్జెట్ లో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఓ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు తక్కువ ధరలో ఉన్నప్పటికీ.. వాటిపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ కార్లను కొనేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు. ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?
కార్ల కంపెనీలు తమ సేల్స్ పెంచుకునేందుకు కొన్ని సందర్భాల్లో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా కొత్త ఏడాది సందర్భంగా TaTa కంపెనీకి చెందిన కొన్ని కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. టాటా కంపెనీకి చెందిన పంచ్ , టియాగో కార్లను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దీంతో ఈ కార్లు తిరిగి ఈవీల రూపంలో మార్కెట్లోకి వచ్చాయి. వీటికి సంబంధించిన MY2024, MY2025అనే ఉత్పత్తులపై డిస్కౌంట్లు వర్తించనున్నాయి. ఇవి ఈ నెలాఖరు వరకే ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.
టాటా టియాగో MY2024 ఉత్పత్తులైన మూడు వేరియంట్లపై డిస్కౌంట్లు ప్రకటించారు. వీటిలో 3.3 కిలో వాట్ బ్యాటరీ కలిగిన XE వేరియంట్ పై రూ.50,000 డిస్కౌంట్ ప్రకటించారు. అలాగే 3.3 కిలో వాట్ బ్యాటరీ కలిగిన XT MR వేరయింట్ పై రూ.70,000 డిస్కౌంట్ ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ XE వేరియంట్ రూ.8.57 లక్షల ప్రారంభధరతో విక్రయిస్తున్నారు. XT MR వేరయింట్ ను రూ.9.61 లక్షలతో విక్రయిస్తున్నారు. మరో కారు XTLR రూ.10.63 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తుండగా.. దీనిపై రూ. 85,000 డిస్కౌంట్ ను అనౌన్స్ చేశారు.
టాటా కంపెనీకి చెందిన మరో కారు పంచ్ ఈవీలపై తగ్గింపు ధరను ప్రకటించారు. ఈ కంపెనీకి చెందిన MY2024 కి చెందిన ఉత్పత్తుల్లో 3.3 కిలో వాట్ కు చెందిన MR స్మార్ట్ అండ్ స్మార్ట్ ప్లస్ కారుపై రూ.40,000 డిస్కౌంట్ ప్రకటించారు. అలాగే 3.3 కిలోవాట్ MR కారుపై రూ.50,000 డిస్కౌంట్ ను అనౌన్స్ చేశారు. టాటా పంచ్ లోని 3.3 కిలోవాట్ ఎల్ఆర్ వేరియంట్ పై రూ.50,000 డిస్కౌంట్ ను అనౌన్స్ చేశారు. ఈ మోడల్ లోని స్మార్ట్, స్మార్ట్ ప్లస్ కు మాత్రం డిస్కౌంట్ వర్తించదని పేర్కొన్నారు.
కంపెనీల మధ్య పోటీ ఏర్పడి మార్కెట్లోకి కొత్త ఈవీలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇదే సమయంలో టాటా కంపెనీ తన సేల్స్ పెంచుకునేందుకు భారీ ఆఫర్లను ప్రకటించింది. టాటా కంపెనీ ఈవీలు తక్కువ ధరలనే లభిస్తుండగా.. వీటిపై తగ్గింపు ధరను ప్రకటించడంతో వినియోగదారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. దేశంలో కార్ల సేల్స్ లో రెండో స్థానంలో ఉన్న టాటా కంపెనీ ఈ డిస్కౌంట్లతో టాటా ఏ మేరకు సేల్స్ ను పెంచుకుంటుందో చూడాలి.