https://oktelugu.com/

Klinkara : క్లింకార పుట్టాక మెగా ఫ్యామిలీ దశ తిరిగిపోయిందా..?

ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే వారు చేస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : January 9, 2025 / 11:24 AM IST

    Klinkara

    Follow us on

    Klinkara : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ఆయనకి మంచి క్రేజ్ ను క్రియేట్ చేసి పెడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే 2012వ సంవత్సరంలో ఉపాసన ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీళ్లిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నప్పటికి ఉపాసన మీద కొంతమంది కొన్ని ట్రోల్స్ అయితే చేస్తూ వచ్చారు. కానీ వీళ్లు వాటిని పట్టించుకోకుండా వాళ్ల కెరియర్ ను వాళ్ళు బిల్ట్ చేసుకుంటూ ముందుకు సాగారు. ఇక ఉపాసన అపోలో కి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటూ ముందుకు సాగుతుంటే రామ్ చరణ్ మాత్రం తను చేసే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాడు. ఇక పెళ్లై వాళ్లకు 11 సంవత్సరాలు అయినప్పటికి వాళ్లకు పిల్లలు కాకపోవడం తో ఇక వాళ్ళకి పిల్లలు పుట్టరు అంటూ చాలామంది చాలా ట్రోల్స్ అయితే చేశారు. వాటి వేటిని పట్టించుకోకుండా వాళ్లు సంయమనాన్ని పాటిస్తూ ముందుకు సాగుతూ రావడం విశేషం… ఇక ఎట్టకేలకు గత ఎడాది డిసెంబర్ లో ఉపాసన తల్లి కాబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాక వాళ్ళను విమర్శించిన ప్రతి ఒక్కరూ కామ్ గా ఉన్నారు. ఇక రామ్ చరణ్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.

    నిజానికి మొదటి నుంచి కూడా ఉపాసన ను విమర్శించిన వారే తన మంచితనాన్ని చూసి కీర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఉపాసన కడుపులో క్లింకార వచ్చినప్పటి నుంచి అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయి. తను కడుపులో ఉన్నప్పుడే త్రిబుల్ ఆర్ సినిమాకు సంబంధించిన నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది…

    ఇక తను పుట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ అవార్డు రావడం.. 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో చక్రం తిప్పడం అలాగే ఏపీ ‘డిప్యూటీ సీఎం’ గా పదవి బాధ్యతలను కొనసాగించడం లాంటివి చకచక జరిగిపోయాయి. అందుకే క్లింకర పుట్టినప్పటి నుంచి తమ ఫ్యామిలీలో అంతా మంచే జరుగుతుంది అంటూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    నిజానికి రామ్ చరణ్ కూడా ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించాడు. మరి ఇలాంటి సందర్భంలో క్లీంకర ను మాత్రం ఎందుకు జనాలకి చూపించడం లేదు అంటూ రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో లో బాలయ్య బాబు రామ్ చరణ్ ని ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. దానికి రామ్ చరణ్ కూడా సమాధానం ఇస్తూ క్లింకర ఎప్పుడైతే తనను నాన్న అని పిలుస్తుందో అప్పుడు తప్పకుండా క్లింకర ను చూపిస్తానని చెప్పడం విశేషం…