https://oktelugu.com/

Japanese Car: భారత్ లో దూసుకుపోతున్న జపాన్ కారు.. దీని ధర తెలిస్తే షాక్ అవుతారు..

ప్రపంచంలో భారత్ వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో ఆటోమోబైల్ రంగానికి కలిసి వస్తోంది. ప్రజల్లో తలసరి ఆదాయం పెరగడంతో సొంతంగా ఓ కారు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే కార్లను మాత్రమే కాకుండా విదేశాలకు చెందిన ప్రీమియం కార్ల వైపు కూడా మనసు పెడుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : December 4, 2024 / 03:12 PM IST

    Japanese-Car

    Follow us on

    Japanese Car: ప్రపంచంలో భారత్ వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో ఆటోమోబైల్ రంగానికి కలిసి వస్తోంది. ప్రజల్లో తలసరి ఆదాయం పెరగడంతో సొంతంగా ఓ కారు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే కార్లను మాత్రమే కాకుండా విదేశాలకు చెందిన ప్రీమియం కార్ల వైపు కూడా మనసు పెడుతున్నారు. దీంతో కొన్ని కంపెనీలు భారత్ లో అడుగుపెట్టి తమ అమ్మకాలను పెంచుకుంటున్నాయి. జపాన్ కు చెందిన నిస్సాన్ కంపెనీ భారత్ లో అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఈ కాలంలో నిస్సాన్ కు చెందిన చాలా కార్లు పాపులర్ అయ్యాయి. అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం లైక్ చేసే కార్లను నిస్సాన్ అందుబాటులో ఉంచుతుంది. ఈ క్రమంలో రూ. 6 లక్షలకు అందించే ఓ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని వివరాల్లోకి వెళితే..

    ఇండియాలో నిస్సాన్ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,12,241 యూనిట్లు విక్రయించినట్లు ఇటీవల విడుదల చేసిన లెక్కల్లో తెలిపింది. అయితే వీటిలో కొన్ని కార్లను బాగా ఆదరించారు. వీటిలో ‘మాగ్నైట్ ’ ఒకటి. సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ లో ఉన్న ఈ కారును 2020లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆకట్టుకునే డిజైన్ తో పాటు, మంచి ఫీచర్లు ఉన్న ఈ కారును మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉందనే పేరు వచ్చింది. నిస్సాన్ కంపెనీ మొత్తం జరిపిన అమ్మకాల్లో మాగ్నైట్ కే ఆ క్రెడిట్ దక్కుతుందని అంటున్నారు.

    ఈ కారు ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్ానయి. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ కారును రూ.6 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. 5 గురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లే ఇందులో ఎల్ఈ డీ హెడ్ ల్యాంప్స్, ఎల్ ఈడీ రన్నింగ్ లైట్స్, ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లో కొత్త మాగ్నౌట్ మార్కెట్లోకి వచ్చిన తరువాత దీనికి ఆదరణ పెరిగిపోయింది. మొత్తం 6 వేరియంట్లలో లభించే ఈ కారు టాప్ ఎండ్ వేరియంట్ రూ.11.50 లక్షల ధరతో విక్రయించనున్నారు.

    నిస్సాన్ మాగ్నౌట్ దేశీయ అమ్మకాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీని కంటే ముందు కిక్స్, మైక్రా, టెర్నానో వంటివి మార్కెట్లోకి వచ్చినా.. మాగ్నౌట్ కు ప్రిఫరెన్స్ ఇచ్చారు. దేశీయంగానే కాకుండా విదేశాలకు నిస్సాన్ కార్లు ఎగుమతులు అవుతున్నాయి. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా వాహనాలపై ఎక్కువగా ఆదరణ పెరిగిపోతుంది. భారత్ లో తయారవుతున్న కార్లకు మంచి ఆదరణ పెరుగుతుండడంతో వీటి అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి. ప్రీమియం లుక్ లో కనిపించే ఈ కారు తక్కువ ధరకే రావడంపై వినియోగదారులు దీని కోసం ఎగబడుతున్నారు. ఈ కారు మారుతి సుజుకీ బ్రెటటా, వెన్యూ, సోనెట్,మారుతి ఫ్రాంక్స్ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.