https://oktelugu.com/

Mullaperiyar Dam : 35 లక్షల మందిని ముంచబోతున్న ముళ్ల పెరియార్‌ డ్యామ్‌.. ముంపునకు కారణం ఏంటంటే?

సాగునీటి ప్రాజెక్టులు ఉంటుంది... భూములకు విలువ ఉంటుంది. జీవరాశికి నీరు దొరుకుతుంది. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రాజుల కాలం నుంచే చెరువులు, డ్యామ్‌లు నిర్మించం ప్రాంభమైంది. అయితే మన దేశంలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ డ్యామ్‌ ఇప్పుడు 35 లక్షల మందికి ముప్పుగా మారింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 4, 2024 / 03:03 PM IST

    Mullaperiyar Dam

    Follow us on

    Mullaperiyar Dam : సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు ఉంటే.. అక్కడ గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. పంటలు బాగా పండుతాయి. సాగు, తాగునీటికి కొరత ఉండదు. కానీ, మన దేశంలోని ఓ డ్యామ్‌ ఇప్పుడు లక్షల మందిని భయపెడుతోంది. ఎప్పుడు కూలుతుందో అని ప్రజలు భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా ప్రమాదం జరుగకుండా నివారించే చర్యలపై నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టే.. కేరళలో ఉన్న 130 ఏళ్ల చరిత్ర ఉన్న ముల్ల పెరియార్‌ డ్యాం. పురాతన డ్యాం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. భారీ వర్షాలు కురిసినప్పుడు సమీప గ్రామాలు, పట్టణాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరోసారి ముల్ల పెరియార్‌ డ్యామ్‌పై చర్చ జరుగుతోంది. ఈ డ్యామ్‌ బద్ధలైతే ఐదు జిల్లాల్లో ఊహకందని నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 4.5 లక్షల మంది ప్రజలతోపాటు, వారి ఆస్తులను మింగేస్తుంది. అని ఆనకట్ట భద్రతను పరిశీలిస్తున్న నిపుణులే హెచ్చరిస్తున్నారు.

    1880లో నిర్మాణం..
    తమిళనాడులో ఉన్న పెరియార్‌ నదిపై 1880లో అప్పటి బ్రిటిస్‌ ప్రభుత్వం మద్రాసు ప్రెసిడెన్సీలో అధికారంలో ఉన్న ట్రావెన్‌ కోసం సంస్థానానికి అధిక వ్యవయంతో నిర్మించిన ముల్ల పెరియార్‌ డ్యామ్‌ 1895 లో పని ప్రారంభించింది. నిర్మాణంలో ఉపయోగించిన మోర్టార్‌ ఈ రికీ డ్యామ్‌లో 8,100 ఎకరాల్లో సుర్టీ, సున్నపురాయి మిశ్రమంగా ఉంది. డ్యామ్‌పై వివాదం మిలియన్ల మంది ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే చెత్త రాజకీయంగా దిగజారింది. ఆనకట్ట పెరియార్‌ నదిపై నిర్మించబడింది, ఇది అంతర్‌ రాష్ట్ర నది కాదు. కొత్త డ్యామ్‌ నిర్మాణం కోసం ముందుకు వెళ్లేందుకు కేరళ ప్రభుత్వానికి తమిళనాడు నుంచి ఎలాంటి గ్రీన్‌ సిగ్నల్‌ అవసరం లేదు. ఇక డ్యామ భద్రతపై అధ్యనం చేసిన ప్రముఖ హైడ్రాలజిస్ట్, ఢిల్లీలోని ఐఐటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపత ప్రొఫెసర్‌ ఎకే.గోసైన్‌ భారీ వర్షాలుకురిస్తే డ్యాం కూలిపోవడం ఖాయమని తెలిపారు.

    తమిళనాడుకు జీవనాధారం..
    ఇదిలా ఉంటే ముల్ల పెరియార్‌ డ్యామ్‌ తహిళనాడులో ఐదు జిల్లాలకు తాగునీటి సరఫరా, సాగునీటి సరఫరా చేస్తుంది. విద్యుత్‌ ఉత్పత్తి అవసాల కోసం పూర్తిగా ముల్లు పెరియార్‌ డ్యామ్‌పై ఆధారపడి జీవిస్తోంది. రామనాథపురం, తేని, దిండిగల్, శివగంగ, మధురై జిల్లాలు ఈ డ్యామ్‌ నుంచి పూర్తిగా నీటిపై ఆధారపడి ఉన్నాయి. మొత్తం పరీవాహక ప్రాంత, డ్యామ్‌ మొత్తం కేరళకు చెందిన భూమిలో నిర్మించింది. బ్రిటిష్‌ ఇంజినీర్‌ అయిన జాన్‌ పెన్నిక్యూక్‌ తన ఇంటి నిధులతో డ్యామ్‌ నిర్మిచాడని తహిళనాడుకు చెందిన ప్రభుత్వం వాదించినా కొత్త డ్యామ్‌ నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలో ఉన్నారు.