Nani and Vijay Devarakonda : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అయినప్పటికి యంగ్ హీరోలు తమదైన రీతి లో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగడమే కాకుండా తమదైన రీతిలో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో నాని, నితిన్, విజయ్ దేవరకొండ లాంటి వారు తమ పరిధిని దాటి స్టార్ హీరో రేంజ్ కి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంటే కొంతమంది యంగ్ హీరోలు మాత్రం వాళ్లని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు అంటే నాని విజయ్ దేవరకొండ, నితిన్ లాంటి హీరోలు స్టార్ హీరో రేంజ్ ను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక వీళ్లలో నాని, విజయ్ దేవరకొండ ఇద్దరు పాన్ ఇండియా సినిమాలను చేస్తుంటే నితిన్ మాత్రం తెలుగు సినిమాలనే చేస్తూ ముందుకు సాగుతున్నారు. కారణం ఏదైనా తెలుగు సినిమాలకే పరిమితం అవ్వడం వల్ల యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరు అతన్ని అభిమానిస్తున్నారు. కానీ పాన్ ఇండియాలో మాత్రం ఆయనకు పెద్దగా మార్కెట్ లేకపోవడంతో రెమ్యూనరేషన్ పరంగా అయినా మార్కెట్ పరంగా అయిన కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. కానీ ఇలాంటి సందర్భంలో ఆయన పాన్ ఇండియా సినిమాలు ఎందుకు చేయడం లేదనే ధోరణిలో కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక రీసెంట్ గా ఆయనని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన పాన్ ఇండియాకి తగ్గ కథ ఆయన దగ్గరికి వస్తే తప్పకుండా తను పాన్ ఇండియా సినిమా చేస్తానని చెప్పాడు. ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోలు మంచి విజయాలను సాధించాలని వాళ్ళ ఫాన్స్ కోరుకుంటున్నారు.
అయితే ఈ ముగ్గురు హీరోల్లో నితిన్ మార్కెట్ పరంగా కొంతవరకు వెనకబడ్డాడనే చెప్పాలి. మరి ఆయన తన మార్కెట్ ని పెంచుకొనే విధంగా భారీ సక్సెస్ ను సాధిస్తే స్టార్ హీరో రేస్ లో తను కూడా ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక నాని విజయ్ దేవరకొండలతో పోలిస్తే నితిన్ ఆ ఒక్క విషయంలో మాత్రం కొంతవరకు వెనకబడ్డడనే చెప్పాలి. మరి వీళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ ముగ్గురు కనక స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నట్లైతే చాలామంది స్టార్ డైరెక్టర్లు సైతం తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు…