
ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు వివరించాడు. తాను రచించిన నీతి శాస్త్రంలో మనకు పనికొచ్చే అంశాలు ఎన్నో ప్రస్తావించాడు. ఆనాడు ఆయన సూచించిన మార్గాలు నేటికి కూడా అనుసరణీయంగానే ఉన్నాయి. ఆడవారి పాత్ర కుటుంబంలో ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై స్పష్టత ఇచ్చాడు. ఆడవారు సమర్థులైతేనే కుటుంబం సజావుగా సాగుతుంది. భార్యను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆమెకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు చాణక్యుడు చెప్పాడు. దీంతో ఆమె ఎలా ఉంటే కుటుంబం బాగుపడుతుందో తెలియజేశాడు.
విద్యావంతురాలైన స్రీ
కుటుంబంలో విద్యావంతురాలైన స్త్రీ ఉంటే ఆ కుటుంబం చక్కగా తయారవుతుంది. ఎందుకంటే ఆమె తన శక్తియుక్తులతో కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు సహకరిస్తుంది. సంస్కారవంతమైన ఆడది మాత్రమే పిల్లలను మంచి పద్ధతిలో పెంచుతుంది. పవిత్రమైన స్త్రీ కుటుంబాన్ని కూడా పవిత్రంగా ఉంచేలా ప్రణాళిక రచిస్తుంది. మనలో మంచి గుణాలు అలవడేలా చేస్తుంది. కుటుంబానికి అదృష్టం కలిసి రావడానికి కూడా కారణమవుతుంది. ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటుంది.

సహనం గల స్త్రీ
ఆడవారికి సహనమే ఆభరణం. స్త్రీలకు ఎంత శాంత స్వభావం ఉంటే అంత గౌరవం లభిస్తుంది. కొందరుంటారు మగవారికంటే వారికే ఆగ్రహం ఉంటుంది. అలాంటి వారితో కుటుంబానికి చెడు ఫలితాలే వస్తాయి కానీ మంచివి మాత్రం రావు. ఈ నేపథ్యంలో ఆడవారి అణకువ చూడ ముచ్చటగా ఉంటుంది. పరుష పదజాలం వాడితే ఎవరు కూడా వారిని గౌరవించరు. ఆడవారికి అణకువ అలంకరణగా ఉంటుంది. ఇంట్లో ఇల్లాలు సహనంతో ఉంటేనే పనులు చక్కబడతాయి.
Also Read: Hero Govinda: పనిమనిషి వేషంలో హీరో ఇంట్లో మకాం వేసిన అమ్మాయి… ఆమె ఎవరో తెలిసి అందరూ షాక్!
ప్రశాంతత
భార్య ప్రశాంతంగా ఉంటే ఇంట్లో వాతావరణం బాగుంటుంది. ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. ఇంటిని సానుకూలంగా చూసుకునే స్వభావం ఉంటుంది. ప్రేమ, గౌరవం పంచుతుంది. ఈ లక్షణాలున్న స్త్రీలు భార్యగా లభిస్తే పురుషుడికి అదృష్టం వరిస్తుంది. భార్య ఓపికగా ఉంటే పనులు చక్కగా ముందుకు సాగుతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం ఒకరిపై మరొకరికి కలుగుతుంది. కుటుంబాన్ని ఏకతాటిపై నడిపించడంలో ఆడవారి పాత్ర ఎంతో ముఖ్యం.
లక్ష్మీస్వరూపం
చాణక్య నీతి ప్రకారం భార్యను లక్ష్మీస్వరూపంగా చూస్తారు. పిల్లలను కూడా ఆదర్శంగా పెంచడంలో ఎంతో కృషి చేస్తుంది. వారి ప్రవర్తన చెడు దారుల్లో వెళ్లకుండా చేస్తుంది. పిల్లలకు మంచి విలువలు అందివ్వడంలో కీలక భూమక పోషిస్తుంది. కుటుంబ ఉన్నతికి పాటుపడుతుంది. భర్తతో పాటు అందరిని మంచి మార్గంలో నడిపిస్తుంది. దీంతో కుటుంబంలో కలహాలు లేని కాపురం చేసేందుకు ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సౌఖ్యం కోసం స్త్రీ తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది. చాణక్య నీతి ప్రకారం ఇలాంటి విషయాలు ఎన్నో సూచించాడు.