
India Spin Pitch Controversy: గడిచిన మూడు టెస్టు మ్యాచులలో భారత్ ఆసీస్ పై 2-1 ఆధిక్యం తో ఉన్నది.మొదటి రెండు మ్యాచులలో స్పిన్ బౌలింగ్ తో ఆసీస్ ని మట్టికరిపించిన భారత్, మూడవ టెస్టులో మాత్రం ఆసీస్ స్పిన్ బౌలర్ల దాడికి తట్టుకోలేక చేతులెత్తేశారు.ఆసీస్ స్పిన్ బౌలర్లు అయినా మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్, టాడ్ మార్ఫిల స్పిన్ బౌలింగ్ దాటికి మన టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది.
అయితే గత మ్యాచ్ లో మాత్రం ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన కంటే ఎక్కువగా స్పిన్ పిచ్ మన ఓటమికి కారణం అయ్యిందని విశ్లేషకులు చెప్తున్నారు.నాగ్‌పూర్, ఢిల్లీతో పాటు ఇటీవలే జరిగిన ఇండోర్ పిచ్ ఎన్ని చర్చలకు దారి తీసిందో మన అందరికీ తెలిసిందే, దీనితో ఇప్పుడు త్వరలో అహ్మదాబాద్ లో జరగబోతున్న మ్యాచ్ పైన కూడా భయాందోళనలు ఎదురయ్యాయి.ఎందుకంటే ఆ పిచ్ కూడా స్పిన్ బౌలర్లు కి అత్యంత అనుకూలమైనది.

ఈ నేపథ్యం లో మన స్వదేశం లో ఉన్న పిచ్ లు మొత్తం తయారు చేయించింది మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అని మాజీ పిచ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.ఆయన మాట్లాడుతూ ‘ధోని టెస్టు ఫార్మటు మ్యాచులకు కెప్టెన్ అయ్యే ముందు, మన టెస్ట్ మ్యాచులు నాలుగు రోజులకు తక్కువ కాకుండా జరిగేవి.మ్యాచ్ తుది ఫలితం నాల్గవ రోజు కానీ,లేదా ఐదవ రోజు కానీ తెలిసేది.ఎందుకంటే అప్పటి పిచ్ లు కాస్త గడ్డి మరియు తేమతో నిండి ఉండేది, అవి తోలి మూడు రోజు ఫాస్ట్ బౌలర్లకు మరియు, తర్వాతి రోజు స్పిన్ బౌలర్స్ కి అనుకూలంగా ఉండేవి, కానీ ఎప్పుడైతే ధోని కెప్టెన్సీ చేపట్టాడో అప్పటి నుండి స్పిన్ బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ లు తయారు చేయించేవాడు.ఎందుకంటే భారత్ ఆటగాళ్లకు స్పిన్ ఆడడం అంటే చాలా ఇస్తామని ధోని చెప్పాడు.అప్పటి నుండి ఇక్కడి గ్రౌండ్స్ మొత్తం స్పిన్ బౌలర్స్ కి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేయించాము’ అంటూ చెప్పుకొచ్చాడు.