PhonePe- Google Pay: ప్రస్తుతం వ్యాపార వ్యవహారాలన్ని ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి యాప్ లతో నగదు బదిలీ చేస్తున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఆర్థిక వ్యవహారాలు క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రజలు వీటికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఎవరు కూడా లిక్విడ్ క్యాష్ వాడటం లేదు. అంతా ఆన్ లైన్ పేమెంట్ కే ఇష్టపడుతున్నారు. ఇంకా భవిష్యత్ లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఖాతాల నుంచి క్షణాల్లో డబ్బులు పంపే యాప్ లు రావడంతో వినియోగదారులకు సులభంగా వ్యవహారాలు పూర్తవుతున్నాయి. ఏ పేమెంట్ చేయాలన్నా ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలతో ఫోన్ పే, గూగుల్ పేలకు షాక్ తగలనుంది. పేమెంట్ యాప్స్ మార్కెట్ షేర్ 30 శాతానికి పరిమితం కావాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు అమలులోకి వస్తే ఫోన్ పే, గూగుల్ పేలకు భారీ నష్టాలు రానున్నాయి. ఫోన్ పే (46.7 షేర్) , గూగుల్ పే (33.3 షేర్) నష్టపోనున్నాయి.
దీంతో వ్యాపార లావాదేవీలపై ప్రభావం పడనుంది. దీనిపై సదరు యాజమాన్యాలు కేంద్రం తీసుకునే నిర్ణయం మరో మూడేళ్లు పొడిగించాలని కోరుతున్నాయి. మరోవైపు పేటీఎం, అమెజాన్ పే, వాట్సాప్ పేలకు లాభం కలగనుంది. దీంతో కేంద్రం తన నిర్ణయం వాయిదా వేస్తుందా? లేక అమలు చేస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆన్ లైన్ సంస్థలకు కొన్నింటికి మోదం, మరికొన్నింటికి ఖేదం కలగనుంది. దీనిపై కేంద్రం ఎలా ముందుకు వెళ్తుందనేది తెలియడం లేదు.

ఫోన్ పే, గూగుల్ పే లకు జరిగే నష్టంతో అవి ఏ మేరకు స్పందిస్తాయో అనేది సందేహమే. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ యాప్ లతో ఇప్పటికే ప్రజలు ఆకర్షితులయ్యారు. ఫోన్ పే, గూగుల్ పేలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పనులు చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. దీన్ని కొనసాగించేందుకు సదరు సంస్థలు ముందుకు రావడంతో ప్రజలకు కూడా సమయం ఆదా అవుతోంది. దీంతో ఫోన్ పే, గూగుల్ పేలు ప్రభుత్వాన్ని తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోరడంతో ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అంతుచిక్కడం లేదు.