T20 World Cup Semi Final Race: టీ20 వరల్డ్ కప్ ఈసారి జట్లతో దోబూచులాడుతోంది. పోటీలో ఉన్న ఆరు జట్లలో ఇంతవరకు ఒక్క జట్టు సెమీస్ కు చేరకపోవడం గమనార్హం. పతకాల పట్టికలో ముందంజలో ఉన్నా ఏ జట్టు కూడా సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోలేదు. దీంతో ఏ జట్టు సెమీస్ చేరుతుందో తెలియడం లేదు. మొత్తానికి ఆటలో అరటిపండు అనే ధోరణికి వెళ్లిపోయింది. మరోపక్క వరుణుడు కూడా జట్ల పాలిట విలన్ గా మారుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నా సెమీస్ కు మాత్రం బెర్త్ ఖాయం చేసుకోవడం లేదు.

ఇంగ్లండ్, శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో ఫలితం కోసం ఎదురు చూడటమే ఆస్ట్రేలియా ముందున్న అవకాశం. ఆసీస్ గెలిచి శనివారం ఇంగ్లండ్ పై శ్రీలంక గెలిస్తే ఏడు పాయింట్లతో ఆసీస్ ముందు నిలుస్తుంది. లంక ఓడితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో మెరుగైన రన్ రేట్ కారణంగా ఏ జట్టుకు ఎక్కువ రన్ రేట్ ఉంటే అది సెమీస్ కు చేరుతుంది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న లంకకు కూడా చాన్స్ ఉంటుంది. ఇక చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై ఆ జట్టు గెలవాలి. ఐర్లండ్, అఫ్గనిస్తాన్ ఇప్పటికే పోటీ నుంచి నిష్క్ర మించాయి.
ఇంగ్లండ్, శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో ఫలితం కోసం ఎదురు చూడటమే ఆస్ట్రేలియా ముందున్న అవకాశం. ఆసీస్ గెలిచి శనివారం ఇంగ్లండ్ పై శ్రీలంక గెలిస్తే ఏడు పాయింట్లతో ఆసీస్ ముందు నిలుస్తుంది. లంక ఓడితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో మెరుగైన రన్ రేట్ కారణంగా ఏ జట్టుకు ఎక్కువ రన్ రేట్ ఉంటే అది సెమీస్ కు చేరుతుంది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న లంకకు కూడా చాన్స్ ఉంటుంది. ఇక చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై ఆ జట్టు గెలవాలి. ఐర్లండ్, అఫ్గనిస్తాన్ ఇప్పటికే పోటీ నుంచి నిష్ర్కమించాయి.

గ్రూప్ 2లో ఉన్న నాలుగు జట్లలో పోటీ నెలకొంది. పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా తమ చివరి మ్యాచ్ ల్లో గెలిస్తే నేరుగా సెమీస్ కు వెళతాయి. ఇండియాకు ఓడినా సెమీస్ ఆశలు సజీవంగానే ఉంటాయి. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లలో ఓ జట్టు ఓడాలి. భారత్ ఓడి దక్షిణాఫ్రికా, పాక్ గెలిస్తే దక్షిణాఫ్రికా సెమీస్ చేరుతుంది. ఇక ఇండియా, పాక్ ఆరు పాయింట్లతో సమానంగా ఉండటం గమనార్హం. మెరుగైన రన్ రేట్ కారణంగా పాకిస్తాన్ సెమీస్ చేరి టీమిండియా ఇంటికెళుతుంది. సెమీస్ కు చేరుకోవాలంటే సఫారీ జట్టుకు విజయం కావాలి. ఓటమి పొందితే పాక్ లేదా బంగ్లాదేశ్ కు అవకాశం ఉంటుంది. రన్ రేట్ లో వెనుకబడిన బంగ్లాదేశ్ సెమీస్ చేరాలంటే పాకిస్తాన్ పై నెగ్గాలి. దక్షిణాఫ్రికా ఓడిపోవాలి. ఈ గ్రూప్ లో నెదర్లాండ్, జింబాబ్వే సెమీస్ ఆశలు గల్లంతైన విషయం తెలిసిందే.
ఇలా ఎటు చూసినా సెమీస్ రేసులో ఆయా జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి. ఒక టీం ముందుకెళ్లాలంటే మరో టీం ఓడిపోవాలి. మెరుగైన రన్ రేట్ ఉండాలి. ఇన్ని సమీకరణాలుండడంతో మరో 6 మ్యాచ్ ల తర్వాత కానీ సెమీస్ రేసును చెప్పలేని విధంగా ఉంది.