Savitri- NTR And ANR: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ మహానటి ఎవరంటే సావిత్రి పేరే చెబుతారు. కళ్లతోనే నటించే సావిత్రి తెలుగు రాష్ట్రానికి చెందిన అమ్మాయే అయినా.. భారతదేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. గొప్ప గొప్ప నటులు సైతం సావిత్రి తో నటించడానికి వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సావిత్రి కాల్ షీట్ కోసం ఏఎన్నార్ లాంటి వారు తమ సినిమాలను వాయిదా వేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ సూపర్ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సావిత్రి.

సావిత్రి సినీ కెరీర్ ఎంత అద్భుతంగా ఉండేదో.. పర్సనల్ లైఫ్ చాలా దుర్భరంగా సాగిందని అంటారు. ఆ విషయాలన్నీ నాగ్ అశ్విన్ ‘మహానటి’ సినిమా ద్వారా చూపించారు. ఈ క్రమంలో సావిత్రి ఈ పొజిషన్లో ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సాయం అందలేదా..? అనే సందేహం చాలా మందికి ఉంది. ముఖ్యంగా తెలుగు దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సావిత్రితో ఎన్నో సినిమాలు చేశారు. మరి ఆమెకు ఎందుకు సాయం చేయలేదు..? అని చర్చలు పెట్టుకుంటున్నారు.
సావిత్రి తన పుట్టినిల్లు తెలుగు సినిమా పరిశ్రమ అయితే.. మెట్టినిల్లు తమిళ పరిశ్రమ అనేవారు. ఆమె తెలుగు హీరోలతో చాలా సినిమాలు చేశారు. చిన్న నాటి నుంచే నాటకాల్లో పాత్రలు వేసిన సావిత్రిని చూసి నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు మెచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెకు వెండితెరపై అవకాశం ఇచ్చారు. అయితే కెమెరా ముందు ఆమె సరిగా నటించలేదు. దీంతో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఆ తరువాత కే.విరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పాతాల బైరవి’ అనే సినిమాలో ఛాన్స్ రావడంతో సావ్రతి తన డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.

అక్కినేని నాగేశ్వర్ రావుతో 1953లో ‘దేవదాసు’లో నటించి తెలుగు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. అప్పటి నుంచి సావిత్రి వరుసబెట్టి హిట్టు సినిమాలను చేశారు. అటు తమిళంలోనూ మంచి సినిమాలు చేయడంతో సావిత్రికి తిరుగులేకుండా పోయింది. ఈ క్రమంలోఆమె మిగతా హీరోయిన్ల కంటే ఎక్కువగా డబ్బు కూడా సంపాదించారు. నటిగానే కాకుండా కొన్నిసినిమాలకు నిర్మాతగా.. దర్శకురాలిగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
సావిత్రి సినీ లైఫ్ జీవితం సక్సెస్ అని చెప్పొచ్చు. కానీ పర్సనల్ లైఫ్ అంతా విషాదంతో ముగిసింది. 1952లో ఆమె జెమినీ గణేశన్ ను రహస్యంగా పెళ్లి చేసుకున్న తరువాత ఆమె జీవితం మారిపోయింది. ఫ్యామిలీ లైఫ్లో ఎన్నో కష్టాలను అనుభవించిన సావిత్రి మద్యానికి బానిసయ్యారు. ఆ తరువాత ఆ వ్యసనాన్ని ఆమె వదులుకోలేకపోయారు. ఈ వ్యసనంతోనే సావిత్రిపై తోటి నటులకు బ్యాడ్ ఇంప్రెస్ ఏర్పడింది. మద్యం మానివేయాలని సావిత్రికి ఎంతో మంచి నచ్చజెప్పారు. కానీ సావిత్రి అప్పుడున్న పోజిషన్లో ఎవరి మాట వినలేదు.
ఈ క్రమంలో తెలుగు స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కూడా సావిత్రికి ఉన్న వ్యసనంపై ఎన్నో సూచనలు చేశారు. ఇప్పటికైనా తన జీవితాన్ని బాగు చేసుకోవాలని చెప్పారు. కానీ ఆమె ఎవరి మాటా వినలేదు. దీంతో సావిత్రిపై చాలా మందికి కోపం ఉండేది. అందుకే ఆమె డబ్బును కోల్పోయి.. దీనస్థితిలో ఉన్న సమయంలో ఎవరూ తన దగ్గరికి రాలేదు. అటు తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంది నటించినా.. ఆమెను చివరిసారిగా చూడడానికి రాలేదని ఇండస్ట్రీలో అనుకుంటారు.