Credit Card vs Debit Card: బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి డెబిట్, క్రెడిట్ కార్డులు తప్పనిసరిగా ఉంటున్నాయి. కొందరికి అయితే ఒకటికి మించి కార్డులు బ్యాంకులు వెంటపడి మరి ఇస్తున్నాయి. అయితే కార్డులు తీసుకోగానే బాగుంటుంది. కానీ వీటి నిర్వహణలో పకడ్బందీగా ఉంటేనే ఆర్థిక సమతుల్యం ఉంటుంది. కొందరు డెబిట్ కార్డ్ కంటే క్రెడిట్ కార్డుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే చేతిలో డబ్బు లేకపోయినా క్రెడిట్ కార్డును వాడుతూ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తారు. కానీ బిల్లు కట్టే సమయంలో ఆవేదన చెందుతూ ఉంటారు. కొందరు సరైన సమయంలో బిల్లులు చెల్లించక వడ్డీలు కడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో క్రెడిట్ కార్డు కంటే డెబిట్ కార్డు బెటర్ అని అంటున్నారు. మరి ఎందుకు బెటర్?
ఏదైనా షాపింగ్ చేస్తే ముందుగా క్రెడిట్ కార్డును తీస్తూ ఉంటాం. ఇలా క్రెడిట్ కార్డును తీయడం వల్ల ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియకుండా ఉంటుంది. దీంతో డబ్బులు అదుపులో లేకుండా పోతాయి. అదే డెబిట్ కార్డు అయితే జేబులో ఉన్నంతవరకే ఖర్చు పెడుతూ ఉంటాం. బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో ముందే తెలుసుకొని అంతవరకు మాత్రమే ఖర్చు చేయాలని అనుకుంటాం. అందువల్ల డెబిట్ కార్డును వాడుతూ ఉంటే ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది.
అనవసరమైన ఖర్చులు చెల్లించేటప్పుడు చాలా వరకు క్రెడిట్ కార్డులనే వాడుతూ ఉంటారు. అయితే ఒకేసారి క్రెడిట్ కార్డును దూరం పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. కొన్ని విషయాల్లో డెబిట్ కార్డును జేబులో ఉంచుకొని క్రెడిట్ కార్డును ఇంటి వాద్దే వదిలేసి వెళ్ళండి. ఇలా వెళ్లిన తర్వాత కొన్ని అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి మనసు రాదు. దీంతో డబ్బు ఆదా అవుతుంది. అదే క్రెడిట్ కార్డ్ జేబులో ఉంటే వెంటనే కొనుగోలు చేస్తాం.
Also Read: ఆ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్సే అర లక్ష.. ఏ బ్యాంకులో ఎంత ఉండాలో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు సరైన సమయంలో చెల్లించకపోతే క్రెడిట్ స్కోరు తగ్గుతూ ఉంటుంది. దీంతో ఖాతాదారుని పై చెడు ప్రభావం పడుతుంది. ఫలితంగా సిబిల్ స్కోర్ తగ్గి బ్యాంకు వ్యవహారాల్లో కొన్ని సాధ్యం కాకుండా ఉంటాయి. అదే డెబిట్ కార్డు అయితే ఆ సమస్య ఉండదు. అంతేకాకుండా ఎంతవరకు బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుందో అంతే ఖర్చు చేస్తాం. అయితే కొన్నిసార్లు డెబిట్ కార్డు ఎక్కువగా వాడటం వల్ల రివార్డ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. అందువల్ల డెబిట్ కార్డుకు బదులు క్రెడిట్ కార్డు నే వాడే ప్రయత్నం చేయాలి.
ఇక క్రెడిట్ కార్డు పై కొందరు వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ వస్తువులకు అయినా మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించాలని అనుకుంటారు. కానీ ఇది అసలు మంచిది కాదు. ఎందుకంటే వాయిదాల రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి మొత్తం చెల్లిస్తే కొంత డబ్బు సేవ్ చేసుకుంటారు. ఒకవేళ వాయిదాల రూపంలో వస్తువు కొనుగోలు చేసిన వాయిదాలు పూర్తయ్యేసరికి ఆ వస్తువు పనికిరాకుండా పోయే అవకాశం ఉంది. అందువల్ల సాధ్యమైనంతవరకు డెబిట్ కార్డు మాత్రమే వాడాలి.