Homeకరోనా వైరస్Corona Treatment: కరోనా చికిత్సకు 8 కోట్ల ఖర్చు,, 50 ఎకరాలు అమ్మేశాడు.. అయినా..

Corona Treatment: కరోనా చికిత్సకు 8 కోట్ల ఖర్చు,, 50 ఎకరాలు అమ్మేశాడు.. అయినా..

Corona Treatment: కరోనా కల్లోలం అంతా ఇంతా కాదు. మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. మొదటి, రెండో దశల్లో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసి పోయిన సంగతి తెలిసిందే. కొన్ని సార్లు అదృష్టం తలుపు తడితే మరోమారు దురదృష్టం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని ధర్మజయ్ అనే రైతుకు గత మే నెల 2న కరోనా సోకింది. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా అతడికి ఖరీదైన వైద్యం అవసరమైంది. దీని కోసం డబ్బులు కూడా ఎక్కువగానే ఖర్చయ్యాయి.

Corona Treatment
Corona Treatment

దీంతో మెరుగైన వైద్యం కోసం అతడిని చెన్నైలోని కార్సొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రోజుకు రూ. మూడు లక్షలతో వైద్యం చేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే దాదాపు ఎనిమిది నెలల పాటు చికిత్స అందించినా ఫలితం మాత్రం దక్కలేదు. లండన్ నుంచి వచ్చిన వైద్యులు కూడా అతడిని ట్రీట్ చేశారు. కానీ అతడి అదృష్టం మాత్రం మారలేదు. విధి వెక్కిరించింది.

Also Read:  పంజాబ్ లో సీఎం అభ్యర్థి ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణకు రెడీ

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అతడి అవయవాలు పూర్తిగా పాడైపోయాయి. కిడ్నీ విఫలమైంది. దీంతో ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అతడికున్న దాదాపు 50 ఎకరాల భూమని అమ్మి వైద్యం చేయించినా ప్రాణాలు మాత్రం దక్కలేదు. దాదాపు రూ.8 కోట్లు ఖర్చు చేసినా చివరకు చావే శరణ్యం అయింది.

ఇన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉన్న అతడి ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తుది శ్వాస విడిచాడు. దీంతో ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ప్రాణాలు మాత్రం దక్కలేదు. కరోనా మహమ్మారికి బలైపోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నా ధర్మజయ్ మాత్రం ఎంత డబ్బు పెట్టినా ప్రాణాలు మాత్రం పోవడంతో కుటుంబ సభ్యులు రోదించారు. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసిన అదృష్టం లేకపోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఏపీ సర్కారు నుంచి తదుపరి పిలుపు మోహన్ బాబుకే..?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

  1. […] Allu Arjun: గత రెండు చిత్రాలు అల్లు అర్జున్ ఇమేజ్ మార్చివేశాయి. అల వైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్, నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసి టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్నాడు. అల్లు అర్జున్ ని రెండు వందల క్లబ్ లో చేర్చిన అల వైకుంఠపురంలో బన్నీ స్టామినా ఏమిటో నిరూపించింది. తెలుగు,మలయాళ భాషల్లో మాత్రమే విడుదలైన అల వైకుంఠపురంలో మూవీ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ సాంగ్స్ ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో నేషనల్ వైడ్ గా సందడి చేశాయి. […]

Comments are closed.

Exit mobile version