IBPS PO Recruitment 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 4135 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అక్టోబర్ 20వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. దేశంలోని ప్రముఖ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజైంది.

నవంబర్ 10వ తేదీలోపు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2021 సంవత్సరం డిసెంబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన మెయిన్ పరీక్ష జరగనుంది. ఆ తర్వాత నెలలో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి.
https://www.ibps.in/crp-po-mt-xi/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అప్లికేషన్ ను ఫిల్ చేసిన తర్వాత దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ లతో పాటు మరికొన్ని బ్యాంక్ లకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.