Telangana Anganwadi Recruitment 2021: తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు తీపికబురు అందించింది. 164 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అంగన్ వాడీ టీచర్లు, అంగన్ వాడీ సహాయకురాలు, మినీ అంగన్ వాడీ టీచర్ల ఉద్యోగ ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

2021 సంవత్సరం అక్టోబర్ నెల 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం. https://mis.tgwdcw.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాసైన మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి ఉన్న మహిళలు వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తును ఎటువంటి తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. దరఖాస్తును ఫిల్ చేసిన తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకొని తప్పులు లేకుండా దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన రశీదును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. నిరుద్యోగ మహిళలకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది.
ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది.