2025 New Bikes India: కొత్త బైక్ కొనుక్కున్నప్పుడు… బైకును చూస్తాం.. దాని ఇంజన్ ను చూస్తాం.. అది ఎలా మూవ్ అవుతుందో చెక్ చేస్తాం.. కానీ బైక్ కీ గురించి పెద్దగా పట్టించుకోరు ఎవరు. అసలు బైక్ కీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అని అడిగే వారు కూడా ఉన్నారు. కానీ బైక్ కొనే ముందు బైక్ కీ కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఎప్పుడైనా బైక్ కి మర్చిపోవడం.. లేదా అనుకోని పరిస్థితుల్లో వదిలేయడం.. జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో డూప్లికేట్ కీ ని తీసుకుంటూ ఉంటాం. అయితే ఇలా డూప్లికేట్ కి తీసుకునే క్రమంలో ఎన్నో సమస్యలు వస్తాయి. మరి షో రూమ్ లోకి వెళ్లి ఒరిజినల్ కి తీసుకునే అవకాశం ఉందా? అది ఎలాగా?
Also Read: భారతదేశంలో అత్యధిక ఆలయాలు ఉన్న టాప్ 5 రాష్ట్రాలు ఏవో తెలుసా?
కొత్తగా బైక్ కొన్నప్పుడు.. బైక్ తో పాటు రెండు కీస్ ను ఇస్తారు. ఇందులో ఒక కీ మిస్ అయినా.. మరో కి ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ రెండు కీస్ తో పాటు చిన్న ఇనుప వస్తువు ఒకటి ఇస్తారు. దీనిని ఎవరూ పట్టించుకోరు. కానీ అది ఎంతో విలువైనది అని కొంతమంది మెకానిక్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ మెటల్ ను జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలని అంటున్నారు. అంతేకాకుండా ముందు జాగ్రత్తగా దీనిని ఫోటో తీసుకొని అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నారు. మరి ఎందుకు అలా చేయాలి? అసలు అందులో ఏముంది?
మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలుసుకోవాలి. అయితే చాలామంది వస్తువు కొని క్రమంలో మిగతా విషయాలను పట్టించుకోరు. ఇలాగే బైక్ కొన్నప్పుడు కూడా కీస్ తో పాటు వచ్చే ఈ మెటల్ గురించి ఎవరు ఆలోచించరు. కానీ ఇందులో ఒక నెంబర్ ఉంటుంది. ఈ కోడ్ కీలక సమయాల్లో పనిచేస్తుంది. బైక్ కు సంబంధించిన రెండు కీస్ మిస్ అయినప్పుడు ఈ మెటల్ ను తీసుకెళ్లి షో రూమ్ లో ఇస్తే చాలు.. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ కి ఇస్తారు. బైక్ లాక్ తో సంబంధం లేకుండా దీనిని వాహనదారుడికి అందిస్తారు.
Also Read: పవన్ కళ్యాణ్ కే ఎసరు పెడుతున్న ఎన్టీఆర్…
ఇలా దీనిని స్టోర్ చేసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ఇలా కాకుండా బయట షాపుల్లో డూప్లికేట్ కి కొనడం వల్ల అనేక సమస్యలు ఉంటాయి. ఈ డూప్లికేట్ కి ఇచ్చే క్రమంలో షాపు యజమాని మరో కిని తయారు చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత బైక్ కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల బైక్ కొనుగోలు చేసినప్పుడు రెండు కీస్ తో పాటు వచ్చే మెటల్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలని అంటున్నారు.
అయితే ఒక్కోసారి ఈ మెటల్ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల దీనిని ముందుగానే మొబైల్లో ఫోటో తీసుకుని.. దాని నెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ నెంబర్ చెప్పినా కూడా ఒరిజినల్ కి ఇచ్చే అవకాశం ఉంది.