Top Temple states in India: భారతదేశం ఎంతో ప్రాచీన చరిత్రను కలిగి ఉంది. పురాతన కాలంలో మనుషుల జీవితానికి సంబంధించిన విషయాలను తెలిపేందుకు కొన్ని కట్టడాలను నిర్మించారు. వీటిలో దేవాలయాల ఎక్కువగా ఉన్నాయి. దేశంలో ఇప్పటికీ వందల ఎల్లనాటి దేవాలయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. వీటికి కొనసాగింపుగా కొందరు ఆధ్యాత్మిక వాదులు మరిన్ని ఆలయాలు నిర్మించారు. అలా దేశవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల 50 వేల దేవాలయాలు ఉన్నట్లు ఓ నివేదిక తెలుపుతుంది. అయితే ఇందులో ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఆలయాలు నిర్మించినట్లు తెలుస్తోంది. వీటి ప్రకారం దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? వీటిలో అత్యధికంగా దేవాలయాలు కలిగిన రాష్ట్రం ఏది?
Also Read: తిరుమల వెళ్లాలనుకునే వారికి అలెర్ట్!
దేశంలో హిందూమతం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ దేవాలయాలను నిర్మిస్తూ వస్తున్నారు. హిందువులు ప్రతిరోజూ ఈ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలా దాదాపు ప్రతి గ్రామానికి దేవాలయం కచ్చితంగా ఉంటుంది. కమ్యూనిటీ ప్రకారంగా.. గ్రామానికి సంబంధించి.. ఇతర దేవుళ్లకు ఆలయాలను ప్రత్యేకంగా నిర్మిస్తూ వస్తున్నారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఆలయాలను నిర్మించారు. దేశంలో కొన్ని ప్రముఖ ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. వీటిని చూడడానికి విదేశాల నుంచి తరలి వస్తుంటారు. అయితే వీటిలో ప్రముఖమైన దేవాలయాలు.. అత్యధిక దేవాలయాలు కలిగిన రాష్ట్రం గురించి తెలుసుకుందాం..
దేశంలో అత్యధికంగా దేవాలయాలు కలిగిన రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 80,000 దేవాలయాలు ఉన్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ రాష్ట్రంలో మధురై మీనాక్షి, రామేశ్వరం, కంచి కామాక్షి వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. కొందరు ప్రత్యేకంగా సౌత్ టూర్ వేసినప్పుడు ఈ ఆలయాలను సందర్శిస్తుంటారు.
తమిళనాడు తర్వాత అత్యధికంగా ఆలయాలు కలిగి ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ మొత్తం 77 వేల ఆలయాలు ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని షిరిడి గ్రామంలో ఉన్న సాయిబాబా టెంపుల్ ప్రసిద్ధి చెందింది. అలాగే ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం కూడా ప్రముఖంగా నిలుస్తుంది.
దైవ భూమిగా పేర్కొనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం 55 ఆలయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్లోని కాశీ క్షేత్రానికి ప్రపంచం నుంచి భక్తులు తరలివస్తారు. అలాగే ప్రతి ఏటా శివరాత్రి లేదా ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి.
కర్ణాటకలో 34000 ఉండి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో కూడా ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కర్ణాటక రాష్ట్రానికి ఆలయాలు చూడడానికి తరలివస్తుంటారు. రాష్ట్రంలోని హంపిలో ఉన్న విరూపాక్ష టెంపుల్ వసిద్ధి చెందింది. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో వైభవంగా ఉంటుంది.
Also Read: వామ్మో చూస్తుండగానే ఆకాశం అలా మారిపోయింది… మానవాళికి ముప్పు తప్పదా?
ఆంధ్రప్రదేశ్లో 32వేల ఆలయాలు ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతికి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ విజయవాడ కనకదుర్గ టెంపుల్ కూడా ఫేమస్గా నిలుస్తుంది. మొత్తంగా దేశంలో 70% కంటే ఎక్కువగా సౌత్ రాష్ట్రాల్లోనే ఆలయాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.