Scholarship:  విద్యార్థులకు సంవత్సరానికి రూ.20,000 స్కాలర్ షిప్.. ఎవరు అర్హులంటే?

Scholarship: సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. కాలేజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. 2022 సంవత్సరం జనవరి 15వ తేదీ ఈ స్కాలర్ షిప్ కోసం ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు సంస్థాగత ధ్రువీకరణ కోసం చివరి తేదీగా ఉంది. కేంద్ర […]

Written By: Navya, Updated On : December 19, 2021 10:12 am
Follow us on

Scholarship: సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. కాలేజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. 2022 సంవత్సరం జనవరి 15వ తేదీ ఈ స్కాలర్ షిప్ కోసం ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు సంస్థాగత ధ్రువీకరణ కోసం చివరి తేదీగా ఉంది.

కేంద్ర విద్యాశాఖ ఈ స్కాలర్ షిప్ ను అందిస్తోంది. ప్రతి సంవత్సరం 82,000 మంది ఈ స్కాలర్ షిప్ ద్వారా బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ మొత్తంలో 50 శాతం స్కాలర్ షిప్ ను అమ్మాయిలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యలో 80 శాతం మార్కులతో మెరిట్ సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులని చెప్పవచ్చు.

రెగ్యులర్‌ విధానంలో గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వాళ్లు ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ల వార్షికాదాయం 8 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి. ఈ స్కాలర్ షిప్ ద్వారా డిగ్రీ కోర్సులు, బీఈ/బీటెక్‌ పూర్తయ్యే వరకు 10,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌ కు మొదటి మూడు సంవత్సరాలు పదివేలు, తర్వాతి రెండేళ్లు రూ.20 వేలు పొందే ఛాన్స్ ఉంటుంది.

https://scholarships.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న పేద విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.