https://oktelugu.com/

SS Rajamouli: నా సినిమా షూటింగ్​లో హీరో కష్టసుఖాలు అసలు పట్టించుకోను- రాజమౌళి

SS Rajamouli: టాలీవుడ్​ స్టార్ డైరెక్టర్లలో టాప్ నంబర్​ వన్ స్థానంలో ఉంటారుదర్శకధీరుడు రాజమౌళి. ఈయనతో కలిసి పనిచేయాలని ప్రతి హీరో ఆసక్తిగా ఎదురచూస్తుంటారు. కాగా, ఆయన పనితీరేంటో ఇటీవలే ప్రభాస్​ రానా నటించిన బాహుబలి సినిమాతోనే తెలిసిపోయింది. ఈ సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి దేశాన్ని దాటి ఖండాంతరాలకు వ్యాప్తి చెందింది. ఎన్నో రికార్డులతో పాటు అవార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా. ప్రస్తుతం జక్కన్న ఆర్​ఆర్​ఆర్​ సినిమా పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 19, 2021 / 10:13 AM IST

    Unstoppable Balayya

    Follow us on

    SS Rajamouli: టాలీవుడ్​ స్టార్ డైరెక్టర్లలో టాప్ నంబర్​ వన్ స్థానంలో ఉంటారుదర్శకధీరుడు రాజమౌళి. ఈయనతో కలిసి పనిచేయాలని ప్రతి హీరో ఆసక్తిగా ఎదురచూస్తుంటారు. కాగా, ఆయన పనితీరేంటో ఇటీవలే ప్రభాస్​ రానా నటించిన బాహుబలి సినిమాతోనే తెలిసిపోయింది. ఈ సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి దేశాన్ని దాటి ఖండాంతరాలకు వ్యాప్తి చెందింది. ఎన్నో రికార్డులతో పాటు అవార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా. ప్రస్తుతం జక్కన్న ఆర్​ఆర్​ఆర్​ సినిమా పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ పూర్తవగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్​.. భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

    Rajamouli

    కాగా, తాజాగా, మూవీ ప్రమోషన్స్​లో భాగంగా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్​స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో సందడి చేశారు రాజమౌళి. ఆయనతో పాటు కీరవాణి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మనిద్దరం ఇంత వరకు కలిసి పని చేయలేదు కదా.. ఎప్పుడు నాతో సినిమా చేస్తారు.. అవును నన్ను మిమ్మల్ని హ్యాండిల్​ చేయలేనని అన్నారట.. ఎందుకు?.. అని ప్రశ్నించారు.

    దానికి రాజమౌళి స్పందిస్తూ.. భయంతోనే అలా అన్నాను.. చిన్న వాళ్ల నుచి పెద్దవాళ్ల వరకు అందరకీ మీరు గౌరవం ఇస్తారు.. నేను షూటింగ్​లో ఉంటే ఎలా ఉంటానో నాకే తెలేదు. ఎవరైనా గుడ్​మార్నింగ్ చెప్తే.. చిరాకు.. షాక్​ పెట్టుకున్నాక.. హీరో ఎండలో ఉన్నాడా?.. వానలో ఉన్నాడా.. అన్నది అసలు పట్టించుకోను.. నా ఫ్రేమ్ రెడీ అయ్యే వరకు హీరో కష్టసుఖాలు అసలు పట్టించుకోను.. అని చెప్తూ.. ఒకవేళ మీతో చేయాల్సి వస్తే.. మీకు ఎక్కడ కోపం వస్తుందనే భయమే తప్ప ఇంకేం లేదని చెప్పారు రాజమౌళి.