Corona In India: దేశంలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మొన్నటివరకు తగ్గుముఖం పట్టిన కొవిడ్ -19 ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని ఇటీవల ఏయిమ్స్ వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఒకే చోట 10 కేసులను గుర్తిస్తే దానికి కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాలని తెలిపింది.దేశ ప్రజలంతా కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని లేనియెడల జరిమానా విధిస్తామని పలు రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి. ఇప్పటికే వీటిని హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో సిటీల్లో అమలు చేస్తున్నారు. రూ.వెయ్యికి పైగా ఫైన్‌లు విధిస్తున్నా జనాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ షాక్ ఇచ్చింది. కేవలం 24 గంటల్లోనే 16.28 శాతం నుంచి 19.65 శాతానికి కొవిడ్ పాజిటివిటి రేటు పెరిగింది. ఆదివారం 13.13లక్షల శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 2, 58,089మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. వీటిని కలుపుకుని దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.73కోట్లకు చేరింది. కరోనా సెకండ్ వేవ్ కన్నా మూడో దశలోనూ దేశంలో మరణాలు భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే కొవిడ్ వలన 358 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం.. పరిస్థితి ఎలా ఉందంటే?
తాజాగా మరణాలు కలుపుకుని మొత్తం మరణాల సంఖ్య 4, 86, 451కి చేరింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య కూడా 6.02 శాతం పెరుగుదలతో మొత్తం 8,209ల కేసులు దేశంలో వెలుగుచూశాయి. కొత్త కేసుల నమోదుతో పాటు రికవరీ రేటు కూడా పెరుగుతుండటం సానుకూల అంశం. నిన్న ఒక్కరోజే 1.51లక్షల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీల సంఖ్య 3.53 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 94.27 శాతంగా నమోదైంది.
దేశంలో ప్రస్తుతం 16,56,341 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 4.43 శాతమని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమై ఏడాది పూర్తవుతుండగా నేటివరకు 157.20 కోట్ల టీకాలను పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఇంకా 13.79 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్టు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: కరోనా పాజిటివ్ వచ్చిందా.. త్వరగా కోలుకోవాలంటే తీసుకోవాల్సిన ఆహారాలివే?
[…] Sankranthi Festivel: పండుగొచ్చిందంటే ఆ ఉత్సాహం, సరదా వేరు.. సంక్రాంతి అంటేనే ఏపీలోనే పెద్ద పండుగ.. అందులోనూ గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువ. పిండి వంటలు.. కొత్త బట్టలు అవీ ఇవీ అని ఆ హడావుడే చెప్పక్కర్లేదు.. తాజాగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి ఏకంగా 365 రకాల వంటకాలతో ఆతిథ్యమిచ్చింది.. […]
[…] CM KCR: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మరో సంచలనానిని తెరలేపారు. పాలనకు సంబంధించి భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల ఉద్యోగులను భాగస్వామ్యం చేయనున్నట్టు తెలుస్తోంది. అందుకోసం పలు సూచనలు చేయడానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జారీ అయిన జీవో 317 దాదాపు విజయవంతం అయినట్టుగా కనిపిస్తున్నా.. ఉద్యోగుల్లో మాత్రం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. […]