2007 T20 World Cup Bowl Out: సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. ఇదే సెప్టెంబర్ నెల.. దక్షిణాఫ్రికా దేశంలో ఐసీసీ టి20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. హేమా హేమీజట్లన్నీ బరిలో ఉన్నాయి. ధోనీ సారథ్యంలోని భారత జట్టుపై ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు. అప్పుడెప్పుడో ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ఎలా ఉందో.. టి20 వరల్డ్ కప్ లో ఆడే జట్టు కూడా అలానే ఉంది. మొదటి మ్యాచ్ స్కాట్లాండ్ తో జరగాల్సి ఉండగా.. అది వర్షార్పణమయింది. రెండో మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో జరిగింది. ఎలాగూ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రేమికులకు పండగే పండుగ. ప్రతి ఒక్క అభిమానిని ముని వేళ్ళ మీద నిలబెట్టి టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ఆ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో న భూతో.. న భవిష్యత్

ఇంతకీ ఏం జరిగింది
2007లో దక్షిణాఫ్రికాలో టి20 ప్రపంచకప్ ఆడేందుకు వెళ్ళిన భారత జట్టులో సచిన్, ద్రావిడ్ వంటి హేమాహేమీ లు లేరు. కేవలం వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఒక చిన్న ఆశాదీపం. అయితే మొదటి మ్యాచ్ స్కాట్లాండ్ తో జరగాల్సి ఉండగా అది వర్షార్పణమైంది. రెండో మ్యాచ్ లో కాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో భారత్ తలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. కొత్త కుర్రాడు రాబిన్ ఊతప్ప ఆఫ్ సెంచరీ తో అలరించాడు. లక్ష చేతనకు దిగిన పాకిస్తాన్ ను ఆ జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కూడా అర్థ సెంచరీ తో రాణించి మ్యాచ్ ను పాక్ వైపు లాక్కున్నాడు. కానీ చివరి ఓవర్లో 12 పరుగులు అవసరమైన దశలో శ్రీశాంత్ అద్భుతమైన బౌలింగ్ కు తోడు మంచి ఫీల్డింగ్ తో మిస్బా ను రన్ అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్ టై అయింది. తుది ఫలితం కోసం ఎంపైర్లు బౌల్ అవుట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. క్రికెట్ లో ఎప్పటినుంచో ఈ విధానం ఉన్నా టి20 క్రికెట్లో మాత్రం ఇదే ప్రథమం. ఈ బౌల్ అవుట్ లో టీమిండియా క్రీడాకారులు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప వరుసగా ముగ్గురు కూడా వికెట్లను హిట్ చేయడం గమనార్హం. అటు పాకిస్తాన్ నుంచి అర్ఫత్, ఉమర్ గుల్, అహిద్ అఫ్రిది ముగ్గురు వికెట్లను మిస్ చేశారు. అఫ్రిది అయితే వైడ్ బాల్ వేయడం గమనార్హం. దీంతో 3_0 తేడాతో భారత్ పాకిస్తాన్ పై గెలిచింది.
ధోని మాస్టర్ పీస్ అయింది ఇక్కడే
మైదానంలో చాలా కూల్ గా ఉండే ధోని.. వ్యూహాలు రచించడంలో మాత్రం చాలా దిట్ట. బౌల్ అవుట్లో బౌలర్లను వికెట్లను హిట్ చేసేందుకు వచ్చిన సమయంలో ధోని ఒక ప్రణాళిక ప్రకారం వికెట్లకు కాస్త దగ్గరగా.. కచ్చితంగా వికెట్లకు వెనకాల మోకాళ్లపై నిల్చున్నాడు. దీంతో మనోళ్లు ముగ్గురు కూడా వికెట్లను గురి తప్పకుండా హిట్ చేశారు. కానీ పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వికెట్లకు ఆఫ్ సైడ్ కొంత పక్కకు జరిగి చాలా దూరంలో నిల్చున్నాడు. ఇది పాక్ బౌలర్ల ఫోకస్ ను దారి పట్టించింది. ఇక్కడ పాక్ కీపర్ అక్మల్, ధోని మధ్య చిన్న తేడానే ఉంది. టీమిండియా కు t20 వరల్డ్ కప్ లో తొలి విజయాన్ని అందించింది. తర్వాత టి20 ఛాంపియన్ గా భారత్ అవతరించింది.

ధోని శకం మొదలైంది అప్పుడే
టి20 వరల్డ్ కప్ విజయంతో ధోనిలోని మరో కోణం ప్రపంచానికి తెలిసి వచ్చింది. కెప్టెన్గా తాను ఏం చేయగలడో.. ఈ బౌల్ అవుట్ విధానం ద్వారా చిన్న టైలర్ లో చూపించాడు. ఇక అక్కడి నుంచి ధోని శకం మొదలైంది. తన ఆలోచనలతో జెంటిల్మెన్ గేమ్ కాస్త మైండ్ గేమ్ గా మార్చాడు. టి 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా జోగిందర్ శర్మతో చివరి ఓవర్ వేయించి మిస్బా ఉల్ హక్ ను బోల్తా కొట్టించాడు. తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో బౌల్ అవుట్ వేయించిన ధోని.. ఫైనల్ మ్యాచ్లో ఆల్ అవుట్ చేయించాడు. క్రికెట్లో ఎవరికి అర్థం కాని.. హేమహేమీలకి అంతు పట్టని చిన్న ట్రిక్ తో పాకిస్తాన్ ను వెర్రి వెంగళప్పలను చేశాడు. క్లాస్ రూమ్ లో టీచర్ పాఠం చెబుతున్నప్పుడు అడిగే ప్రశ్నలకు ఎవ్వడైనా సమాధానం చెప్తాడు. అదే సమాధానాన్ని పరీక్షల్లో రాస్తే టాపర్ అవుతాడు. అలాగే మైదానంలో పరుగులు ఎవడైనా తీస్తాడు. కానీ ప్రత్యర్థిని పరుగులు తీయకుండా ఆపగలిగిన వాడే విన్నర్ అవుతాడు. అలా ఆపగలిగేలా చేశాడు కాబట్టే ధోని టి20 క్రికెట్ మొదటి వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకునేలా చేశాడు. భారత క్రికెట్లో తాను ఎప్పటికీ స్పెషల్ అని నిరూపించుకున్నాడు. నేటితో పాకిస్తాన్ తో భారత్ బౌల్ అవుట్ ఆడి 15 సంవత్సరాలు పూర్తి అవుతుండడం విశేషం.