Nandini Rai: అందం, అభినయం ఉన్నా… కాలం కూడా కలిసి రావాలి. లక్ ఉన్న అమ్మాయిలు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు. కొందరు ఏళ్ల తరబడి ఎదురు చూసినా కనీస గుర్తింపుకు నోచుకోరు. అలాంటి హీరోయిన్స్ లో నంది రాయ్ ఒకరు. ఈ హైదరాబాదీ భామ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటిపోతుంది. అయినా చెప్పుకోదగ్గ ఒక్క ఆఫర్ రాలేదు. 2011 లో విడుదలైన హిందీ చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్’ తో నందిని రాయ్ వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం తెలుగులో పలు చిన్న చిత్రాల్లో నటించారు. నందిని రాయ్ నటించిన చిత్రాల్లో చెప్పుకోదగ్గవి సుధీర్ ”మోసగాళ్లకు మోసగాడు”, సునీల్-నరేష్ ల ”సిల్లీ ఫెలోస్”.

నటిగా బ్రేక్ రాకపోవడంతో 2018లో బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా నందిని రాయ్ ఎంట్రీ ఇచ్చారు. హీరో నాని హోస్ట్ గా సాగిన ఈ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు. నందిని రాయ్ హౌస్ లో తన గ్లామర్ తో ఆకట్టుకున్నారు. అయితే ఆమె హౌస్ లో చాలా సాఫ్ట్ గా ఉండేవారు. వివాదాలు, గొడవల జోలికిపోయేవారు కాదు. ఆమె ఆట అంతగా ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో ఆమె 8వ వారమే ఎలిమినేటై బయటికి వచ్చేశారు.
బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. గతంతో పోల్చుకుంటే కొంత మేర గుర్తింపు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఓటీటీ చిత్రాలు, డిజిటల్ సిరీస్లలో అవకాశాలు దక్కాయి. హై ప్రీస్ట్, షూట్ యట్ అలైర్ అనే వెబ్ సిరీస్లలో నందిని రాయ్ నటించారు. అలాగే మెట్రో కథలు టైటిల్ తో తెరకెక్కిన యాంతాలజీ సిరీస్ చేశారు. అలాగే ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అనే సిరీస్లో నటించారు. ఆమె చివరిగా కనిపించిన చిత్రం గాలివాన. ఇది జీ 5లో విడుదలైంది.

వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేసుకుంటూ పోతుంది నందిని. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. అయితే సోషల్ మీడియాలో అమ్మడు కాక రేపోతుంది. హాట్ ఫోటో షూట్స్, వీడియోలతో రచ్చ చేస్తున్నారు. నందిని రాయ్ సోషల్ మీడియా స్కిన్ షో తో నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. కామెంట్స్, లైక్స్ తో విరుచుకుపడుతున్నారు. దీంతో నందిని రాయ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది హీరోయిన్స్ కి ఇంస్టాగ్రామ్ ఒక ఆదాయ మార్గంగా ఉంది. ఆ కారణంతో మొహమాటం లేకుండా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.