
తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిలో చికిత్సకు ఉపయోగించే మోనో క్లోనల్ యాంటీబాడీస్ కాక్ టెయిల్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కు జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ దరఖాస్తు చేసింది. కాక్ టెయిల్ కు జైడస్ క్యాడిలా ZRC-3308 పేరు పెట్టింది. తేలికపాటి లక్షణాలున్న కేసుల్లో కాక్ టెయిల్ ప్రధాన చికిత్సల్లో ఒకటిగా మారుతుందిని కంపెనీ పేర్కొంది. యూఎస్, యూరప్ లో నిర్వహించిన పరిశోధనల్లో తేలికపాటి లక్షణాలున్న రోగుల్లో వైరస్ లోడ్ ను తగ్గించిందని పేర్కొంది.