
కర్ణాటకలో అధికార మార్పిడికి తెర లేస్తోంది. అధికార పక్షం నేతలే సీఎంను మార్చాలని పట్టుబడుతున్నారు. అధకార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు యడ్యూరప్ప నాయత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరినీ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని వాపో తున్నారు. సీఎంను మార్చేయాలని హైకమాండ్ మీద ఒత్తిడి తెస్తున్నారు.
సీఎం మీద అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. యడ్యూరప్ప మీద సొంత పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎలాగైనా సీఎంను మార్చేసి మంత్రి పదవులు దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. సీనియర్ మంత్రులు చాలా మందే సీఎంకు వ్యతిరేకంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.దీంతో యడ్యూరప్ప పీఠం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోందని పార్టీ వర్గాల్లో గుసగుసలు జరుగుతున్నాయి.
సీఎం యడ్యూరప్పను మార్చేయాలని సీనయర్ మంత్రి అరవింద్ లింబాలి కోరారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆపరేషన్ కమలంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, సీనియర్ మంత్రి సీపీ యోగేశ్వర్ తోపాటు 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉంటూ రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. బీజేపీ హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.
కర్ణాటకలో సీఎం యడ్యూరప్పకు ఎలాంటి ఢోకా లేదని సీఎం వర్గీయులు చె బుతున్నా పరిస్థితులు మరోలా ఉన్నాయని తెలుస్తోంది. అయితే సీఎం యడ్యూరప్ప ఎ వరి పేరు ప్రతిపాదిస్తే వారే సీఎంగా ఉంటారని మరో ప్రచారం సాగుతోంది. సీఎం యడ్యూరప్ప నాయకత్వంలో మార్పులు ఉంటాయని జరుగుతున్న ప్రచారంలో ఊహాగానాలు వినవస్తున్నాయి. యడ్యూరప్ప నాయకత్వాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారనే విషయం అర్థమైపోతోంది.
యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర పరిపాలనలో జో క్యం చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని శాఖల్లో ఆయన దృష్టి పెట్టడంతో సదరు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలనలో ఆయన అధికారం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అందుకే పరిపాలనలో మార్పు కోరుతున్నారని తెలుస్తోంది. దీంతో యడ్యూరప్పకు కాలం చె ల్లిందనే వాదనలు వినిపిస్తున్నాయి.