
Uttar Pradesh: అతనో ప్రభుత్వ వైద్యుడు. తన కంటే వయసులో చిన్నదైన ఓ మహిళను వలచాడు. అప్పటికే ఆమెకు పెళ్లయి పిళ్లాడున్నా అతడిని నమ్మింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అతడితో దాదాపు నాలుగేళ్లు గడిపింది. కానీ చివరకు సదరు డాక్టర్ నువ్వెవరని ఇంటి నుంచి గెంటేయడం గమనార్హం. దీంతో ఆమె అతడి ఇంటి ముందే కూరగాయలు అమ్ముతూ నిరసన తెలుపుతోంది. దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు.
యూపీ(Uttar Pradesh)లో యునానీ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న జీడీ యాదవ్ ఫేస్ బుక్ ద్వారా ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త ప్రేమగా మారింది. ఆకర్షణలో పడిన మహిళ అతడి మాయమాటలను నమ్మింది. అప్పటికే పెళ్లయినా సరే ఉద్యోగం ఇప్పిస్తానని అతడు చెప్పడంతో అతడితో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. దీనికి అతడు ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు.
దీంతో అతడి ఇంటి ఎదుటే మహిళ ఓ చెట్టు కింద కూరగాయలు పెట్టుకుని అమ్ముతోంది. ఆ పిల్లాడు కూడా అతడికే పుట్టాడని చెబుతోంది. కానీ ఇక్కడ వైద్యుడి మాటలు మాత్రం వేరుగా ఉన్నాయి. సదరు మహిళతో తనకు సంబంధం లేదని బుకాయిస్తున్నాడు. ఆ బాబు కూడా తనకు పుట్టలేదని ఆమె భర్తకు పుట్టాడని చెబుతున్నాడు. తన ఆస్తి కాజేయాలని పథకం వేసిందని పేర్కొన్నాడు.
గతంలో తాను ఎల్ ఐసీ ఏజెంటనని పరిచయం చేసుకుందన్నాడు. తన తల్లి అనారోగ్యంతో బాధ పడుతోందని వైద్యం చేయాలని కోరింది. ఆమె దీన స్థితిని చూసి తన ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం ఇస్తే ఇప్పుడు తన పైనే విమర్శలు చేస్తూ ఆస్తి కాజేయాలని చూస్తోందని చెప్పారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ ఇద్దరి మధ్య వయసులో తేడా బాగుందని తెలుస్తోందన్నారు.
Also Read: కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి గాధ: దీనికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎందుకు?