MP Aravind:తెలంగాణలో ఈటల రాజేందర్ సీఎం ఎందుకు కాకూడదు అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడి కలుపుకుపోయి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సీఎం అవ్వడం కరెక్టేనని.. కానీ కేసీఆర్ చాతనకాకపోతే కేటీఆర్ ఎందుకు సీఎం కావాలని అరవింద్ ప్రశ్నించారు.ఒక యూట్యూబ్ చానెల్ తో మాట్లాడిన అరవింద్ ఈ హాట్ కామెంట్ చేశారు.
కేటీఆర్ కంటే కూడా టీఆర్ఎస్ ను నడిపించి ఉద్యమంలో జైలు పాలు అయ్యి టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కూడా చేసిన ఈటల రాజేందర్ ను సీఎంగా చేయవచ్చు కదా అని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. తనకు కేటీఆర్, హరీష్ తెలుసు అని.. వారితో నాకు పరిచయం ఉందని.. ఈటల రాజేందర్ తో అసలు నాకు బీజేపీలోకి రాకముందు పరిచయం అస్సలే లేదని అరవింద్ తెలిపారు.
కేసీఆర్ తెలంగాణ తెస్తే కేటీఆర్ కు ఎందుకు సీఎం ఇవ్వాలని.. ఈటల రాజేందర్ కు ఎందుకు ఇవ్వకూడదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. జేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారున్నా కేసీఆరే సీఎం సీటు ఎందుకు అధిరోహించాడని అరవింద్ విమర్శించారు. కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ లో తెలంగాణలో సమర్థులే లేరా? అని నిలదీశారు.
ఈటల రాజేందర్ ముందర కేటీఆర్ ఎంత అని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే కవిత, కేటీఆర్ కు గుర్తింపు ఎక్కడిది అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తెలంగాణలో తప్పితే అస్సలు దేశంలో ఎక్కడా మంత్రి కాలేడని హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యంగా ఎన్నుకుంటే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలని సంచలనవ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సర్వేల్లోనూ ఇదే తేలిందని.. ఈటల ముఖ్యమంత్రిని చేయాలని రావడంతోనే ఆయనను కేసీఆర్ తొలగించాడని ఎంపీ అరవింద్ సంచలన నిజాలు పంచుకున్నారు.
టీఆర్ఎస్ సర్వే చేసిందని.. వారి కోవర్టుల నుంచే తనకు ఈ విషయం తెలిసిందని ఎంపీ అరవింద్ అన్నారు. కేసీఆర్ తర్వాత ఈటలను సీఎం చేయాలని ఇంటెలిజెన్స్ సర్వేలో తేలిందని అన్నారు. అందుకే ఈటలను తొలగించారని అన్నారు.
వీడియో