Homeఎంటర్టైన్మెంట్Lakshya: ఆకట్టుకుంటున్న నాగశౌర్య లక్ష్య సింగిల్​ లిరికల్​ సాంగ్​!

Lakshya: ఆకట్టుకుంటున్న నాగశౌర్య లక్ష్య సింగిల్​ లిరికల్​ సాంగ్​!

Lakshya: అశ్వత్థామ సినిమాలో యాక్షన్​ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు నాగశౌర్య. ఇటీవల వరుడు కావలెను అంటూ రొమాంటిక్​ కామెడీ ఎంటర్​టైనర్​తో ప్రేక్షకులను పలకరించి.. విభిన్న కథలను ఎంచుకునే హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందారు. రీతు వర్మ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో తెలుగు తెరకు దర్శకురాలిగా పరిచయమయ్యారు. కాగా, ప్రస్తుతం నాగ శౌర్య వరుసగా మూడు, నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి లక్ష్య సినిమా. ఆర్చరీ బ్యాక్​డ్రాప్​ నేపథ్యంలో స్పోర్ట్స్​ యాక్షన్​ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని.. నార్త్ స్టార్​ ఎంటర్​టైన్​మెంట్​, శ్రీ వెంకటేశ్వర సినిమాస్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

O Lakshyam Lyrical Song |Naga Shaurya,Ketika Sharma|Dheerendra Santhossh Jagarlapudi |Kaala Bhairava

సంతోష్​ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్​, పోస్టర్స్​ అభిమానులకు మెప్పించాయి. తాజాగా, ఈ సినిమా నుంచి సింగిల్​ లిరికల్​ వీడియో విడుదలైంది.  ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబుతో నాగశౌర్యకు ఉన్న రిలేషన్​ను ఎలివేట్​ చేసేలా ఈ సాంగ్​ను రూపొందించారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు.

నటుడు – దర్శకుడుగా పేరు పొందిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య ఓ సినిమా చేస్తున్నారు నాగశౌర్య.  తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్​డేట్​ సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే.. ఇందులో నాగశౌర్య పాత్ర భిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా క్రేజీ ప్రాజెక్టులతో విభిన్న కథలతో నాగశౌర్య తన కెరీర్లో దూసుకుపోతున్నాడన్నది నిజం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version