https://oktelugu.com/

Viral Video : నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా బట్టలు మార్చుకున్న యువతి? వైరల్ వీడియో.

ట్రాక్ సూట్ ధరించి రోడ్డుమీద ఓ అమ్మాయి నడుస్తూ వచ్చింది. ఇక్కడి వరకు ఒకే కదా. కానీ సడెన్ గా ఆగి రోడ్డు మీదనే బట్టలు మార్చుకోవడం ప్రారంభించింది. ఇదంతా అక్కడ ఉన్నవారికి పెద్దగా అర్థం కాలేదు. ఈమె చేసే పని చూసి బిత్తరపోయారు. ఆమెకు మతిస్థిమితం లేదా అనుకున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 21, 2024 / 05:06 PM IST

    Viral Video

    Follow us on

    Viral Video :  సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టి ఆకర్షించడానికి కొందరు వింత వింత చేష్టలు చేస్తున్నారు. ఫేమస్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఓవర్ నైట్ లో స్టార్లుగా మారుతున్నారు. కానీ ఈ చేష్టలు ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇదంతా మాకు సంబంధం లేదు. మేం సోషల్ మీడియాలో స్టార్లు కావాలంతే.. దాని కోసం ఎంత దూరం అయినా వెళ్తాం. ఏదైనా చేస్తాం అనే విధంగా మరో వీడియో తాజాగా వైరల్ అవుతుంది. సామాజిక ప్రయోగం అనే పేరుతో ఓ అమ్మాయి ఇంటర్నెట్‌ లో జనాలను ఉలిక్కిపడేలా చేసింది. అంతేకాదు తాను అనుకున్న గోల్ ను కూడా రీచ్ అయినట్టు ఉంది. అదేనండి వైరల్ అయింది.

    ట్రాక్ సూట్ ధరించి రోడ్డుమీద ఓ అమ్మాయి నడుస్తూ వచ్చింది. ఇక్కడి వరకు ఒకే కదా. కానీ సడెన్ గా ఆగి రోడ్డు మీదనే బట్టలు మార్చుకోవడం ప్రారంభించింది. ఇదంతా అక్కడ ఉన్నవారికి పెద్దగా అర్థం కాలేదు. ఈమె చేసే పని చూసి బిత్తరపోయారు. ఆమెకు మతిస్థిమితం లేదా అనుకున్నారు. ఆ పక్కనే రెస్టారెంట్ లో కూర్చున్న వాళ్లు కూడా కళ్లు అప్పగించి ఈ బట్టలు మార్చుకుంటున్న అమ్మాయిని చూస్తున్నారు. అందరూ అనుకున్నట్టు ఆమెకు మతిస్థిమితం లేకుండా కాదు. తానొక కంటెంట్ సృష్టికర్త ఏరి అని తెలిసింది.

    Instagram @ary_bloomలో 4.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీడియోలో ఏరి ట్రాక్ సూట్‌లో ఓ బ్యాగ్‌ని పట్టుకుని వీధిలో నడుస్తూ వచ్చింది.. ఈమె నడుస్తున్న దారికి దగ్గర్లోనే ఓ రెస్టారెంట్ ఉంది. అందులో బీర్లు తాగుతూ జనాలు కూడా కూర్చున్నారు. అయితే ఈ వీడియో మన దేశానికి చెందినది కాదు. అక్కడ బహిరంగంగా మద్యం సేవించడం చట్టవిరుద్ధం కాదు కావచ్చు. ఇక రెస్టారెంట్ దగ్గరకు వెళ్ళగానే ఆమె తన బ్యాగ్ ను పక్కకు పెట్టి తన బ్యాగులో నుంచి బట్టలు తీసుకొని ఒంటి మీద ఉన్న ట్రాక్ పాయింట్ ను మార్చుకునే ప్రయత్నం చేసింది.

    పక్కనే రెస్టారెంట్ లో కూర్చున్న వ్యక్తులు మాత్రం ఈమె చేసే పనులు చూసి బిత్తర పోయారు. కొందరు ఎంజాయ్ కూడా చేస్తున్నారు అనుకోండి. అయినా సామాజిక ప్రయోగం పేరిట ట్రాక్ సూట్ కింద బ్లూ కలర్ కట్ గౌను కనిపించేలా ట్రాక్ సూట్ ని చకచకా విప్పెస్తున్నట్టు వీడియాలో క్లియర్ గా కనిపిస్తుంది. ప్రయోగం ఎందుకు చేసినా సరే ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ రకమైన కంటెంట్ సమాజంలో అసంబద్ధ ధోరణులను ప్రోత్సహించేలా మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి కంటెంట్ కొన్ని సార్లు ప్రమాదకరంగా ఉంటుంది.

    ఈ వీడియో పోస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా లైక్ చేశారు. లైక్స్ మాత్రమే కాదు ఫన్నీ వ్యాఖ్యలతో కామెంట్ బాక్స్ నిండిపోతుంది కూడా. ఇంట్లో తల్లిదండ్రి పట్టించుకోకపోతే ఇలాగే ఉంటుందని..భయం లేదని కొందరు తిడితే.. మాలాంటి మగవారికి సూపర్ వీడియో అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.