https://oktelugu.com/

Kangua Movie Collections : కంగువా’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..తమ్ముడి ‘కార్తీ’ రికార్డ్స్ ని సూర్య ఎప్పటికీ దాటలేడా?

డిజాస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం రోజులలో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా వివరంగా చూద్దాము.

Written By:
  • Vicky
  • , Updated On : November 21, 2024 / 05:19 PM IST

    Kangua Movie Collections

    Follow us on

    Kangua Movie Collectionsసూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన సినెమా ‘కంగువా’. డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ చిత్రంపై సూర్య అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. మేకర్స్ కూడా ఈ చిత్రం 2000 వేల కోట్ల రూపాయిలు వసూలు చేస్తుందని, ఆ రేంజ్ లో సినిమా వచ్చింది అంటూ అభిమానుల్లో అంచనాలను ఒక రేంజ్ లో పెంచేశారు. టీజర్, ట్రైలర్ కూడా కాస్త కొత్త రకంగా ఉండడంతో కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. 2000 కోట్లు వసూలు చేసే సినిమా అన్నారు, మేము అది నమ్మలేదు కానీ, కనీసం యావరేజ్ రేంజ్ లో అయినా ఉంటుందని అనుకున్నాము, కానీ ఇంత చెత్తగా ఉందేంటి అని అభిమానులు సైతం పెదవి విరిచారు. అలా డిజాస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం రోజులలో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా వివరంగా చూద్దాము.

    మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి 8 కోట్ల 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి . బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అదే విధంగా తమిళనాడు లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలైన ప్రభాస్ కల్కి చిత్రం తమిళనాడు లో 45 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. కానీ సూర్య కంగువా చిత్రం కనీసం 40 కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా ఫుల్ రన్ లో రాబట్టేలా లేదు. కర్ణాటక లో నిన్నటితోనే క్లోజింగ్ పడిపోయింది. మొదటి వారం ఇక్కడ 4 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, ఫుల్ రన్ లో మరో కోటి రూపాయిలు రావొచ్చు.

    అదే విధంగా కేరళలో 6 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, హిందీ వెర్షన్ లో 14 కోట్ల రూపాయిలు,ఓవర్సీస్ లో 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 91 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 44 కోట్ల రూపాయిల షేర్ వసూళ్ళు వచ్చాయి. ఈ వీకెండ్ తో 100 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అయితే కచ్చితంగా అందుకుంటుంది కానీ, ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాలి. ఇదంతా పక్కన పెడితే సూర్య తమ్ముడు కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 145 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సూర్య ఈ వసూళ్లను ఇప్పటి వరకు అందుకోలేదు. ‘కంగువా’ తో అవలీలగా దాటేస్తాడని అనుకున్నారు కానీ, ఈ సినిమా కూడా అంత దూరం వచ్చేలా కనిపించడం లేదు. దీంతో తమ్ముడి కలెక్షన్స్ ని అన్నయ్య ఇక ఎప్పటికి దాటుతాడో అని సోషల్ మీడియా లో ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.