Yashasvi Jaiswal: ఇంగ్లాండ్, భారత్ టెస్ట్ లో ఓపెనర్ గా వచ్చి సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్ బ్రాడ్ మన్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. జైస్వాల్ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తో ఆడిన 10 ఇన్నింగ్స్ ల్లో 90.33 యావరేజ్ తో 813 పరుగులు సాధించాడు. దీంతో అతడు డాన్ బ్రాడ్ మన్ ను ఇంగ్లాండ్ పై యావరేజ్ విషయంలో మినిమం 500 పరుగులు అధిగమించాడు. బ్రాడ్ మన్.. ఇంగ్లిష్ టీమ్ పై 63 ఇన్నింగ్స్ ల్లో 89.78 సగటుతో 5,028 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ టీమ్ మీద 90 ప్లస్ యావరేజ్ కలిగి ఉన్న ఏకైన బ్యాటర్ గా జైస్వాల్ నిలిచాడు.